కరాచీ: డాషింగ్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది పాకిస్తాన్ టి20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో జట్టు పేలవ ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే పొట్టి ఫార్మాట్‌లో ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని ఆఫ్రిది తెలిపాడు.
‘టి20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నానని పాక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులకు తెలియజేస్తున్నా. మూడు ఫార్మాట్లలో నా దేశానికి నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా’ అని ఆఫ్రిది ట్వీట్ చేశాడు. మరోవైపు జట్టులో చోటుపై ఆఫ్రిదికి ఎలాంటి హామీ ఇవ్వలేమని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ పునరుద్ఘాటించినప్పటికీ తాను ఆటగాడిగా కొనసాగుతానని ఆల్‌రౌండర్ స్పష్టం చేశాడు.
టి20 కెప్టెన్సీకి ఆఫ్రిది గుడ్‌బై
Published Mon, Apr 4 2016 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM
Advertisement
Advertisement