Saharyar Khan
-
టి20 కెప్టెన్సీకి ఆఫ్రిది గుడ్‌బై
కరాచీ: డాషింగ్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది పాకిస్తాన్ టి20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో జట్టు పేలవ ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే పొట్టి ఫార్మాట్లో ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని ఆఫ్రిది తెలిపాడు. ‘టి20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నానని పాక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులకు తెలియజేస్తున్నా. మూడు ఫార్మాట్లలో నా దేశానికి నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా’ అని ఆఫ్రిది ట్వీట్ చేశాడు. మరోవైపు జట్టులో చోటుపై ఆఫ్రిదికి ఎలాంటి హామీ ఇవ్వలేమని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ పునరుద్ఘాటించినప్పటికీ తాను ఆటగాడిగా కొనసాగుతానని ఆల్‌రౌండర్ స్పష్టం చేశాడు. -
భారత్‌కు ఎందుకు వెళ్లారు?
షహర్యార్‌ను వివరణ కోరిన పాక్ కరాచీ: బీసీసీఐతో చర్చల కోసం ఇటీవల భారత్‌లో పర్యటించిన పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం వివరణ కోరింది. ఈమేరకు ఆయనకు ఘాటుగా లేఖ రాసింది. డిసెంబర్లో భారత్, పాక్ జట్ల మధ్య జరగాల్సిన క్రికెట్ సిరీస్ గురించి చర్చించేందుకు బీసీసీఐ ఆహ్వానం మేరకు ఖాన్ భారత్‌కు వచ్చారు. అయితే శివసేన ఆందోళనతో ఈ చర్చలు రద్దయ్యాయి. ఈ వ్యవహారంపై పాక్ అంతర్గత వ్యవహారాల సమన్వయ మంత్రిత్వ శాఖ సీరియస్ అయ్యింది. ‘భారత పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని మంత్రి మియాన్ రియాజ్ పీర్జాదా కోరారు. పర్యటనకు ముందు విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించారా? లేదా? అలాగే ప్రధాని అనుమతి ఉందా.. అనే విషయంపై స్పష్టత ఇవ్వమన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇలా వెళ్లడం తొందరపాటు అవుతుంది’ అని ప్రభుత్వం ఆ లేఖలో తెలిపినట్టు పీసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
బీసీసీఐ పశ్చాత్తాపం: పీసీబీ
కరాచీ: తమతో చర్చలు అనివార్య కారణాల రీత్యా రద్దయినందుకు బీసీసీఐ పశ్చాత్తాపం వ్యక్తం చేసిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. ఈమేరకు బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నుంచి తమకు లేఖ అందిందని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. ‘చర్చలు రద్దయినందుకు వారు తమ అశక్తతను వ్యక్తం చేస్తూ పశ్చాత్తాపపడ్డారు. అలాగే ద్వైపాక్షిక సిరీస్ విషయంలో భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని కూడా చెప్పారు. దీంతో డిసెంబర్లో జరిగే ఈ సిరీస్‌పై నమ్మకం కుదరుతోంది. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారమవుతుంది’ అని ఖాన్ తెలిపారు. -
భారత్ సాయం కావాలి
జింబాబ్వే జట్టు రావడం ద్వారా పాకిస్తాన్లో ఆరేళ్ల తర్వాత క్రికెట్ ప్రారంభం అవుతోంది. భారత్ తమకు సాయం చేస్తే తమ దేశంలో పూర్తిస్థాయిలో క్రికెట్ పునరుద్ధరణ జరుగుతుందని పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్యర్ ఖాన్ చెప్పారు.