బీసీసీఐ పశ్చాత్తాపం: పీసీబీ | BCCI repentance: PCB | Sakshi
Sakshi News home page

బీసీసీఐ పశ్చాత్తాపం: పీసీబీ

Published Fri, Oct 30 2015 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

BCCI repentance: PCB

కరాచీ: తమతో చర్చలు అనివార్య కారణాల రీత్యా రద్దయినందుకు బీసీసీఐ పశ్చాత్తాపం వ్యక్తం చేసిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. ఈమేరకు బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నుంచి తమకు లేఖ అందిందని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. ‘చర్చలు రద్దయినందుకు వారు తమ అశక్తతను వ్యక్తం చేస్తూ పశ్చాత్తాపపడ్డారు.

అలాగే ద్వైపాక్షిక సిరీస్ విషయంలో భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని కూడా చెప్పారు. దీంతో డిసెంబర్‌లో జరిగే ఈ సిరీస్‌పై నమ్మకం కుదరుతోంది. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారమవుతుంది’ అని ఖాన్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement