ఆఖరి బంతికి శ్రీలంక గెలుపు
ఆస్ట్రేలియాతో తొలి టి20
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరింతంగా జరిగిన తొలి టి20 క్రికెట్ మ్యాచ్‌లో శ్రీలంకకు విజయం దక్కింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గుణరత్నే (37 బంతుల్లో 52; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో లంక ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. విజయానికి ఆఖరి బంతికి ఒక పరుగు అవసరంకాగా చమర కపుగెడెర (7 బంతుల్లో 10 నాటౌట్) ఫోర్ కొట్టి లంకకు విజయాన్ని అందించాడు. ఫలితంగా మూడు టి20ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో ఉంది.
ఆదివారం గీలాంగ్‌లో రెండో టి20 జరుగుతుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 168 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫించ్ (43; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), క్లింగర్ (38; 4 ఫోర్లు) రాణించారు. ఏడాది తర్వాత బరిలోకి దిగిన మలింగ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన లంక 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 172 పరుగులు చేసి నెగ్గింది.