టెస్టు క్రికెట్ అందమే వేరు...
అభిమాని కాలమ్
ప్రస్తుత తరం కుర్రాళ్లు వన్డేలు, టి20లు అంటేనే ఎక్కువ మోజు చూపుతున్నారు. అరుునా విశాఖలో జరిగిన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌కు కాలేజీ విద్యార్థులు భారీగా వచ్చారు. వీళ్లకి ప్రవేశం ఉచితంగా కల్పించడం వల్ల తమ అభిమాన క్రికెటర్లను చూడటానికి మైదానానికి వచ్చారు. అరుుతే అక్కడక్కడా నిజమైన టెస్టు అభిమానులూ ఉన్నారు. టిక్కెట్ కొనుక్కుని ఐదు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయాన్నే వచ్చి, రోజంతా మ్యాచ్ చూసి వెళ్లిన వారూ కొందరు ఉన్నారు. వారిలో ఒకరు విష్ణుభట్ల రామకృష్ణ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి పదవీ విరమణ చేసిన ఆయనకు టెస్టు క్రికెట్ అంటే బాగా ఇష్టం. టెస్టు క్రికెట్ గొప్పతనం, అందం గురించి, నగరంలో తొలిసారి టెస్టు మ్యాచ్ అనుభవం తదితర అంశాలు ఆయన మాటల్లోనే...
‘నేను 20 ఏళ్ల వయసులో టెస్టు మ్యాచ్ చూడటానికి మద్రాస్ వెళ్లాను. అది కూడా భారత్, ఇంగ్లండ్‌ల మ్యాచ్. వైజాగ్ వచ్చిన కొత్తలో టీవీలు లేని రోజుల్లో రేడియోలో కామెంటరీ వినేవాడిని. మధ్యలో గుర్ అంటూ వచ్చే సౌండ్‌తో కొన్నిసార్లు అర్థం అయ్యేది కాదు. అరుునా సిగ్నల్ సరిగా వచ్చే వరకూ అలాగే పెద్ద రేడియో పట్టుకునే వాళ్లం. ఇప్పుడు టెక్నాలజీ చూసిన తర్వాత ఆ రోజులు గుర్తు వస్తే నవ్వుకుంటున్నాం. టెస్టు మ్యాచ్ టీవీలో వస్తే ఏ రెండు దేశాలు ఆడినా చూస్తాను. నిజానికి ఇదో అద్భుతమైన ఫార్మాట్. తెల్ల దుస్తుల్లో ఆటగాళ్లు... పిచ్ చుట్టూ మోహరించిన . ఫీల్డర్లు... ఎర్రగా మెరిసిపోయే బంతి... చూడటానికి ఎంతో బాగుంటుంది. వన్డేలు, టి20లకు నేను వ్యతిరేకం కాదు. కానీ టెస్టు క్రికెట్ అసలైన క్రికెట్ అని నా ఉద్దేశం. బ్యాట్స్‌మెన్ నైపుణ్యం, ప్రతిభ అన్నీ దీని ద్వారానే బయటకు వస్తారుు. బౌలర్లు వికెట్లు తీయడం కోసం బంతులు వేస్తుంటారు. ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటం అందంగా ఉంటుంది.
బ్యాట్స్‌మన్ చుట్టూ గొడుగులా ఫీల్డర్లు నిలబడితే.. ఆ సమయంలో బ్యాట్స్‌మన్ చూపించే టెక్నిక్‌ను చూడటం అసలైన వినోదం. వైజాగ్‌లో టెస్టు మ్యాచ్ అని తెలియగానే చాలా సంతోషపడ్డాను. టిక్కెట్లు అమ్మడం మొదలైన తొలిరోజే స్టేడియంలో మ్యాచ్ బాగా కనిపించే స్టాండ్‌సలో కొనుక్కున్నాను. ఇదే స్టాండ్‌లో బార్మీ ఆర్మీ (ఇంగ్లండ్ అభిమానులు ఉన్నారు) చేసే హడావుడి, వారి ఉత్సాహం చాలా బాగుంది. టెస్టు క్రికెట్ చూడటం కోసం వాళ్లు అక్కడి నుంచి అంత ఖర్చు చేసుకుని వచ్చి మరీ తమ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి వాళ్ల వల్లే ఆట నిలబడుతుంది. ప్రత్యక్షంగా మ్యాచ్ చూస్తూ వారితో ఆట గురించి చర్చిస్తూ ఉంటే మరింత ఆనందంగా ఉంది. వైజాగ్‌లో టెస్టు మ్యాచ్ నిర్వహించినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా నగరానికి టెస్టు హోదా వచ్చినందున ఇకపై తరచుగా మ్యాచ్‌లు చూడగలుగుతాను.’