ఇంగ్లండ్‌పై విండీస్ గెలుపు | West Indies beat by England | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌పై విండీస్ గెలుపు

Published Tue, Mar 11 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM

ఇంగ్లండ్‌పై విండీస్ గెలుపు

ఇంగ్లండ్‌పై విండీస్ గెలుపు

బ్రిడ్జ్‌టౌన్: టి20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ సరైన సమయంలో సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి టి20లో శామ్యూల్స్ (46 బంతుల్లో 69 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్; 2/21) ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచడంతో 27 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టులో శామ్యూల్స్‌కు తోడు గేల్ (35 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.

శామ్యూల్ బద్రీ (3/17) ఆరంభంలోనే మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. బొపార (24 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), బ్రెస్నన్ (29 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించగలిగారు. శామ్యూల్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement