
తొలి టి20లో కివీస్‌దే విజయం
నేపియర్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టి20ల సిరీస్‌లో 1–0 ఆధిక్యం సాధించింది. ఇటీవలి వన్డే సిరీస్‌ను కివీస్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 141 పరుగులు చేసింది. మహ్ముదుల్లా (47 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు.
ఫెర్గూసన్‌కు మూడు, వీలర్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లకు 143 పరుగులు చేసి గెలిచింది. అయితే 60 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (55 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్రాండ్‌హోమ్ (22 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్వితీయంగా రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 47 బంతుల్లోనే 81 పరుగులను జోడిం చారు. ఈనెల 6న రెండో టి20 జరుగుతుంది.