2–0తో న్యూజిలాండ్‌దే టెస్టు సిరీస్
క్రైస్ట్‌చర్చ్: ఇప్పటికే టి20, వన్డే సిరీస్‌లలో వైట్‌వాష్‌కు గురైన బంగ్లాదేశ్‌కు టెస్టు సిరీస్‌లోనూ అదే ఫలితం పునరావృతమైంది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 0–2తో ఓడిన బంగ్లా తమ పర్యటనను ఘోర పరాజయాలతో ముగించింది. సోమవారం ముగిసిన చివరి టెస్టులో కివీస్ 9 వికెట్ల తేడాతో నెగ్గింది. మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా... నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరు 260/7తో తమ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కివీస్ 354 పరుగులకు ఆలౌటై 65 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.
నికోల్స్ (98; 12 ఫోర్లు) తృటిలో సెంచరీ కోల్పోయాడు. అనంతరం బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 52.5 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. బౌల్ట్, సౌతీ, వాగ్నర్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. 109 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి అందు కుంది. లాథమ్ (41 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), గ్రాండ్‌హోమ్ (33 నాటౌట్; 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు.
బంగ్లాదేశ్ ‘హ్యాట్రిక్’ వైట్‌వాష్
Published Mon, Jan 23 2017 11:52 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM
Advertisement
Advertisement