న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌ | New Zealand Clean Sweep Against Bangladesh | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌

Published Sat, Mar 27 2021 2:44 PM | Last Updated on Sat, Mar 27 2021 2:44 PM

New Zealand Clean Sweep Against Bangladesh - Sakshi

వెల్లింగ్టన్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో న్యూజిలాండ్‌ 164 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను 3–0 తో క్లీన్‌స్వీప్‌ చేసింది. డెవన్‌ కాన్వే (126; 17 ఫోర్లు), డారిల్‌ మిచెల్‌ (100
నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో కదంతొక్కడంతో... తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 318 పరుగులు చేసింది.

వీరిద్దరు ఐదో వికెట్‌కు 159 పరుగులు జోడించారు. ఛేదనలో బంగ్లా దేశ్‌ను జేమ్స్‌ నీషమ్‌ (5/27), మ్యాట్‌ హెన్రీ (4/27) హడలెత్తించడంతో ఆ జట్టు 42.4 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటై ఓడింది. మహ్ముదుల్లా (73 బంతుల్లో 76 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. కాన్వేకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.    


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement