
వెల్లింగ్టన్: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ మరో భారీ విజయం సాధించి సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. తొలి టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందిన కివీస్. రెండో టెస్టులో సైతం అదే తరహా ఆటను పునరావృతం చేసింది. కాగా, బంగ్లాదేశ్ ఘోరంగా వైఫల్యం చెందడంతో సిరీస్‌ను కోల్పోకతప్పలేదు.
రెండో టెస్టులో 80/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 211 పరుగులకు ఆలౌటైంది. ఈ రోజు ఆటలో మరో 131 పరుగులు మాత్రమే చేసిన బంగ్లాదేశ్ మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. ఫలితంగా ఇన్నింగ్స్ తేడాతో పరాజయం చవిచూసింది. కివీస్ బౌలర్లలో వాగ్నెర్ నాలుగు వికెట్లు సాధించగా, ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లతో మెరిశాడు. సౌథీ, గ్రాండ్‌హోమ్, మ్యాట్ హెన్రీలు తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 209 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 432/6 వద్ద డిక్లేర్డ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment