
తొలి టి20 ఇంగ్లండ్‌దే
దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
సౌతాంప్టన్: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డివిలియర్స్ (65), బెహర్దీన్ (64) రాణించడంతో ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 142 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 143 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జానీ బెయిర్‌స్టో (60), హేల్స్ (47) ఇంగ్లండ్‌ను గెలిపించారు