
ఆట ముఖ్యమా... టీవీలో ప్రసారమా!
ముంబై: వర్షం లేదు... వెలుతురు కూడా బ్రహ్మాండం... పిచ్ కూడా ఆటకు అనుకూలంగా ఉంది... ఐసీసీ నిబంధనల ప్రకారం అన్నీ బావున్నారుు. అరుునా సరే గత నెల 28న భారత్, వెస్టిండీస్ రెండో టి20 మ్యాచ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. సాంకేతిక కారణాల వల్లే అని వివరణ ఇచ్చుకున్నా... చివర్లో వాన రావడంతో దాని ప్రభావం కనిపించింది. మనం గెలవాల్సిన మ్యాచ్‌ను వర్షం వల్ల రద్దు చేయాల్సి వచ్చింది. సిరీస్‌ను సమం చేసే అవకాశం భారత్ కోల్పోవడం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఆగ్రహం తెప్పించింది. ఈ బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తూ బీసీసీఐకి ధోని అధికారికంగా ఫిర్యాదు చేశాడు.
ఏం జరిగిందంటే...
భారత్, విండీస్ మధ్య లాడర్ హిల్ (ఫ్లోరిడా)లో రెండో టి20 మ్యాచ్ జరిగింది. అరుుతే సాంకేతిక కారణాలతో మ్యాచ్ నిర్ణీత సమయంకంటే దాదాపు 50 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు ప్రసారకర్త స్టార్ స్పోర్‌ట్స అరుునా మ్యాచ్‌ను షూట్ చేసే ప్రొడక్షన్ బాధ్యతలు సన్‌సెట్ అండ్ వైన్ అనే కంపెనీవి. అరుుతే అసలు సమయంలో మ్యాచ్ ఫీడ్‌ను స్టార్‌కు అప్ లింకింగ్ చేయడంలో ఆ కంపెనీ విఫలమైంది. సమస్య ఏమిటంటూ ధోని పదే పదే అడిగిన మీదట టెక్నికల్ సమస్యలు సరి చేస్తున్నామంటూ, కాస్త ఓపిక పట్టాలంటూ వారు జవాబిచ్చారు.
ఎలా ఆపుతారు?: ఐసీసీ నిబంధనల ప్రకారం వర్షం, వెలుతురు లేకపోవడం, మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడమనే మూడు కారణాలతో మాత్రమే ఆటను ఆలస్యంగా ప్రారంభించవచ్చు. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరగడం ఇదే మొదటి సారి. ‘నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను సరైన సమయంలో ప్రారంభించాల్సింది. శాటిలైట్ సిగ్నల్స్ లేవని ఆటను ఆపుతారా. మరి మైదానంలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి. భారీ ధరకు టికెట్ కొని వచ్చినవారికి ఎవరు జవాబు చెప్పాలి. ప్రొడక్షన్ సంస్థ చేసింది క్షమించరాని తప్పు‘ అని ధోని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ధోనిపై కేసు కొట్టివేత
విష్ణుమూర్తి అవతారంలో వేర్వేరు ప్రకటనలకు ప్రచారం చేస్తున్నట్లు ఓ పత్రికలో ప్రచురితమైన చిత్రానికి సంబంధించిన కేసులో ధోనికి విముక్తి లభించింది. ధోనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. దిగువ కోర్టు ఉత్తర్వులు న్యాయంగా లేవని జస్టిస్ రంజన్, పీసీ పంత్‌లతో కూడిన బెంచ్ అభిప్రాయ పడింది.