
మిల్లర్ మెరుపులు
తొలి టి20లో ఆసీస్‌పై దక్షిణాఫ్రికా విజయం
డర్బన్: డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు; 3 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీలు 95కే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో మిల్లర్ వీరోచిత ప్రదర్శన చేశాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడి మూడు టి20ల సిరీస్‌లో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. జాన్ హేస్టింగ్స్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో స్క్వేర్ లెగ్‌లో మిల్లర్ కొట్టిన సిక్సర్ అయితే బంతి స్టేడియం బయటపడింది. క్రీజులో చివరికంటా నిలిచిన మిల్లర్ ఆటతో దక్షిణాఫ్రికా 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసి నెగ్గింది. డు ప్లెసిస్ (26 బంతుల్లో 40; 4ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు.
కౌల్టర్ నైల్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 157 పరుగులు చేసింది. ఫించ్ (18 బంతుల్లో 40; 2 ఫోర్లు; 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. వేగంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ పవర్‌ప్లేలో 69 పరుగులు చేసింది. అయితే 114 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో మిషెల్ మార్ష్ (25 బంతుల్లో 35; 1 ఫోర్; 2 సిక్సర్లు) రాణించడంతో జట్టు భారీ స్కోరు చేయగలిగింది. తాహిర్‌కు మూడు, రబడా.. వీజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. నేడు (ఆదివారం) జొహన్నెస్‌బర్గ్‌లో రెండో టి20 జరుగుతుంది.