తొలి టి20లో భారత మహిళల గెలుపు | India women in victory in the first T20 | Sakshi
Sakshi News home page

తొలి టి20లో భారత మహిళల గెలుపు

Published Tue, Feb 23 2016 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

తొలి టి20లో భారత మహిళల గెలుపు

తొలి టి20లో భారత మహిళల గెలుపు

34 పరుగులతో ఓడిన లంక
రాంచీ: అనూజా పాటిల్ (17 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు; 3/14) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో... శ్రీలంకతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధిం చింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (36), సృ్మతి మందన (35) రాణించారు. ఓపెనర్లు మిథాలీ రాజ్ (3), వనిత (12) నిరాశపర్చడంతో భారత్ 4 ఓవర్లలో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే కౌర్, మందన మూడో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. చివర్లో అనూజా వేగంగా ఆడటంతో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.

సుగందిక 3, కౌసల్య 2 వికెట్లు తీశారు. తర్వాత లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 96 పరుగులకే పరిమితమైంది. సురంగిక (41 నాటౌట్) టాప్ స్కోరర్. అనూజ ధాటికి లంక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. సిరివర్ధనే (18), కరుణరత్నే (14) ఫర్వాలేదనిపించారు. దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. అనూజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 బుధవారం ఇదే వేదికపై జరుగుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement