ఫటాఫట్ ఫ్యాక్ట్స్
1 కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనత ధోని (28) సొంతం
2 ఈ టోర్నీ చరిత్రలో భారత్ రెండుసార్లు ఫైనల్ చేరింది.
3 ప్రపంచకప్‌లలో ‘టై’ అయిన మ్యాచ్‌లు.
4 నలుగురు లంక ఆటగాళ్లు మలింగ, దిల్షాన్, జయవర్ధనే, సంగక్కర టోర్నీలో అత్యధిక (31) మ్యాచ్‌లు ఆడారు.
5 ఇప్పటివరకూ జరిగిన ప్రపంచకప్‌లు
6 అంతర్జాతీయ టి20ల్లోఇప్పటివరకూ టై అయిన మ్యాచ్‌లు
7 ప్రపంచకప్‌లో నమోదైన సెంచరీలు
8 మహిళల తొలి మూడు ప్రపంచకప్‌లలో ఎనిమిదేసి జట్లు మాత్రమే పాల్గొన్నాయి.
9 ఈ మెగా ఈవెంట్‌లో భారత మహిళల జట్టుకు అత్యధికంగా తొమ్మిది మ్యాచ్‌ల్లో మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించింది.
10ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు గేల్ (10)
11ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్ రోహిత్
12మరో 12 వికెట్లు తీస్తే మలింగ ప్రపంచ కప్‌లో 50 వికెట్లు పూర్తి చేస్తాడు.
13 ప్రపంచకప్‌లో 90 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిగత స్కోర్లు 13సార్లు వచ్చాయి.
14 మహిళల ప్రపంచకప్‌లో ఆసీస్ తర్వాత ఇంగ్లండ్, కివీస్ 14 మ్యాచ్‌ల్లో గెలిచాయి.
15 ఎక్కువ పరాజయాలు బంగ్లాదేశ్ (15)
16 ఈసారి టోర్నీలో పాల్గొన్న, పాల్గొంటున్న మొత్తం జట్లు
17 మహిళల టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 17 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌ఉమన్ దియాంద్రా డాటిన్ (వెస్టిండీస్)
18 ప్రపంచకప్‌లో భారత్ గెలిచిన మ్యాచ్‌లు. మొత్తం 28 మ్యాచ్‌లు ఆడింది. 9 ఓడిపోగా, ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
19 చరిత్రలో ఈ టోర్నీలో ఒక్కసారైనా ఆడిన జట్లు
20 మహిళల టి20 ప్రపంచకప్ పోటీల్లో ఒకే మ్యాచ్‌లో అత్యధికంగా 20 ఎక్స్‌ట్రాలు ఇచ్చిన జట్టు న్యూజిలాండ్.
గత విజేతలు
సంవత్సరం వేదిక విజేత రన్నరప్
2007 దక్షిణాఫ్రికా భారత్ పాకిస్తాన్
2009 ఇంగ్లండ్ పాకిస్తాన్ శ్రీలంక
2010 వెస్టిండీస్ ఇంగ్లండ్ ఆస్ట్రేలియా
2012 శ్రీలంక వెస్టిండీస్ శ్రీలంక
2014 బంగ్లాదేశ్ శ్రీలంక భారత్
ప్రైజ్‌మనీ వివరాలు
విజేత : రూ. 23 కోట్ల 44 లక్షలు
రన్నరప్ : రూ. 10 కోట్లు
సెమీస్‌లో ఓడిన జట్లకు : రూ. 5 కోట్లు
లీగ్ దశలో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు : రూ. 33 లక్షల 48 వేలు
టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుకు : రూ. 2 కోట్లు
ప్రపంచకప్ హీరోలు
అత్యధిక పరుగులు : జయవర్ధనే (1016)
అత్యధిక వ్యక్తిగత స్కోరు : బ్రెండన్ మెకల్లమ్ (123)
అత్యధిక వికెట్లు : మలింగ (38)
అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు : అజంతా మెండిస్ (8 పరుగులకు 6 వికెట్లు)
ఒక జట్టు అత్యధిక స్కోరు : శ్రీలంక (266- కెన్యాపై)
అలా జరిగింది!
►దక్షిణాఫ్రికా క్రికెటర్ వాన్ డెర్ మెర్వ్ టి20 ప్రపంచకప్‌లో రెండు దేశాల తరఫున ఆడాడు. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన 2009 ప్రపంచకప్‌లో వాన్ డెర్ మెర్వ్ దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించగా... 2016 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో నెదర్లాండ్స్ జట్టు తరఫున ఆడాడు.
►ఇప్పటివరకు ఐదుసార్లు టి20 ప్రపంచకప్ జరిగినా... ఆతిథ్య జట్టుకు టైటిల్ దక్కలేదు.
►డిఫెండింగ్ చాంపియన్ జట్లకు తదుపరి ప్రపంచకప్ కలసిరాలేదు. ఒకసారి విజేతగా నిలిచిన జట్టు తదుపరి టోర్నీలో కనీసం సెమీఫైనల్‌ను దాటలేకపోయింది.