ఆ ‘గాయం’ మానాలంటే... కరీబియన్లను కొట్టాల్సిందే! | T20 cricket stars all set for power-packed series on new wicket | Sakshi
Sakshi News home page

ఆ ‘గాయం’ మానాలంటే... కరీబియన్లను కొట్టాల్సిందే!

Published Sat, Aug 27 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

ఆ ‘గాయం’ మానాలంటే... కరీబియన్లను   కొట్టాల్సిందే!

ఆ ‘గాయం’ మానాలంటే... కరీబియన్లను కొట్టాల్సిందే!

యూఎస్‌లో భారత్ మొదటి మ్యాచ్
నేడు వెస్టిండీస్‌తో తొలి టి20
ఉత్సాహంగా ధోని సేన
సవాల్‌కు విండీస్ సిద్ధం 


దాదాపు ఐదు నెలల క్రితం ‘సొంతగడ్డపై భారత జట్టు టి20 ప్రపంచ కప్ గెలుచుకోవడం ఖాయం’ అని అభిమానులు ఆశలు పెట్టుకున్న స్థితిలో సెమీఫైనల్లో వెస్టిండీస్ చావుదెబ్బ కొట్టింది. 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడమే బాధ కలిగిస్తే... రెండు నోబాల్స్ కారణంగా వారికి అవకాశం లభించడం పుండు మీద కారం చల్లినట్లుగా అనిపించింది.


నాటి మ్యాచ్ తర్వాత ఇరు జట్లు ఇప్పుడు మరోసారి పొట్టి ఫార్మాట్‌లో పోరుకు సిద్ధం అయ్యారుు. రెండు జట్లలోనూ ఆ మ్యాచ్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు బరిలో ఉన్నారు. గత మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఆశిస్తుండగా... ప్రపంచ చాంపియన్ హోదాలో తమ   ఆధిపత్యం నిలబెట్టుకోవాలని విండీస్ భావిస్తోంది.


అన్నింటికి మించి తొలిసారి అమెరికాలో భారత స్టార్ క్రికెటర్లు ఆడబోతుండటం ఒక్కసారిగా టి20 సిరీస్‌కు కొత్త ఆకర్షణ తెచ్చి పెట్టింది. గావస్కర్ కాలంనుంచి సచిన్ వరకు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు చూడటంతోనే సంతృప్తి చెందిన అమెరికన్ భారతీయులకు ఇప్పుడు అసలైన ఇండియన్ ఇంటర్నేషనల్ మ్యాచ్ మజా దక్కనుంది. 

 

లాడర్‌హిల్ (ఫ్లోరిడా): టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు టి20ల్లో సత్తా చాటేందుకు సన్నద్ధమైంది. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇక్కడి సెంట్రల్ బ్రావర్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో నేడు (శనివారం) తొలి మ్యాచ్ జరగనుంది. జింబాబ్వేపై జూనియర్ జట్టుతో విజయం సాధించిన అనంతరం ధోని మళ్లీ మైదానంలోకి వస్తుండగా... స్యామీ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన కార్లోస్ బ్రాత్‌వైట్ తొలిసారి నాయకత్వం వహిస్తున్నాడు. టి20 బలాబలాల పరంగా చూస్తే విండీస్ చాలా బలంగా కనిపిస్తోంది కాబట్టి భారత్‌కు గెలుపు అంత సులువు కాదు.

 
ఉత్సాహంగా ధోనిసేన

టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం టి20లకు ఎంపిక కాని భారత ఆటగాళ్లంతా స్వదేశం చేరుకోగా... మిగతావారంతా నేరుగా అమెరికాలో అడుగు పెట్టారు. టెస్టుల్లో మెరుగ్గా రాణించిన జట్టు మొత్తం ఆత్మవిశ్వాసంతో ఉంది. ఎప్పటిలాగే టీమిండియా బ్యాటింగ్ భారం విరాట్ కోహ్లిపైనే ఉంది. అతనితో పాటు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చెలరేగేందుకు సిద్ధమయ్యారు. మిడిలార్డర్‌లో రహానే కీలకం కానున్నాడు. ప్రపంచకప్ వరకు సుదీర్ఘ కాలంగా భారత టి20 జట్టులో అంతర్భాగంగా ఉన్న సురేశ్ రైనా ఈ సిరీస్‌లో లేకపోవడం ఒక్కటే జట్టులో కొత్తగా కనిపించే మార్పు. జట్టులోకి వచ్చీ రావడంతోనే ఆకట్టుకున్న రాహుల్‌కు ఇప్పుడు సీనియర్ల రాక తో తుది జట్టులో స్థానం దొరుకుతుందా చూడాలి. బౌలర్లలో బుమ్రా ఆరంభ ఓవర్లలో మళ్లీ కీలకం కానున్నాడు. ఇతర పేసర్లుగా షమీ, భువనేశ్వర్ తుది జట్టులో ఉంటారు. టెస్టుల్లో విండీస్ భరతం పట్టిన అశ్విన్ టి20ల్లోనూ సత్తా చూపించాల్సి ఉంది. వరల్డ్ కప్ సెమీస్‌లో నోబాల్‌తో తీవ్ర విమర్శల పాలు కావడం అతడిని ఇప్పటికే వెంటాడుతూనే ఉండవచ్చు.

కొత్త కెప్టెన్ నేతృత్వంలో...
ప్రపంచ కప్‌ను గెలిపించినా వ్యక్తిగత ప్రదర్శన పేలవంగా ఉందంటూ డారెన్ స్యామీని కెప్టెన్సీతో పాటు జట్టునుంచి కూడా విండీస్ బోర్డు అనూహ్యంగా తప్పించింది. టి20 వరల్డ్ కప్ ఫైనల్లో నాలుగు సిక్సర్లతో హీరోగా మారిపోరుున బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా తన తొలి సిరీస్ ఆడుతున్నాడు. అరుుతే అతనికి పెద్దగా అనుభవం లేకపోరుునా... జట్టు మొత్తం టి20 స్టార్లతో నిండి ఉండటం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా టెస్టు జట్టులో లేని క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, ఆండ్రీ రసెల్, సిమన్‌‌సలతో ఆ జట్టు బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. వీరికి బ్రాత్‌వైట్ మెరుపులు కూడా తోడైతే జట్టుకు తిరుగుండదు. ఇక వరల్డ్ కప్ ఆడని పొలార్డ్, నరైన్‌లు కూడా జట్టులోకి తిరిగి రావడంతో విండీస్ తుది జట్టులో స్థానం కోసం కూడా గట్టి పోటీ నెలకొంది.

జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లి, రాహుల్, రహానే, అశ్విన్, షమీ, బుమ్రా, భువనేశ్వర్ లేదా రవీంద్ర జడేజా.
వెస్టిండీస్: బ్రాత్‌వైట్ (కెప్టెన్), గేల్, చార్లెస్, రసెల్, బ్రేవో, హోల్డర్, కీరన్ పొలార్డ్, సిమన్‌‌స, శామ్యూల్స్, శామ్యూల్ బద్రీ, సునీల్ నరైన్. 


పిచ్, వాతావరణం
గురువారం రాత్రి వరకు ఫ్లోరిడాను ఉరుములు, మెరుపులు ఇబ్బంది పెట్టారుు. అరుుతే ఆదివారం తుఫాన్ వచ్చే అవకాశం ఉన్నా... ఈ మ్యాచ్‌కు మాత్రం వర్షం ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ మైదానంలో ఆరేళ్ల క్రితం తొలిసారి మ్యాచ్‌లు నిర్వహించినప్పుడు తక్కువ స్కోర్లు నమోదయ్యారుు. అరుుతే ఇటీవలి కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం మంచి స్కోర్లు వచ్చారుు. కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు.


పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వెస్టిండీస్ చాలా అద్భుతంగా ఆడుతుంది. సమతూకంతో ఉన్న వారి జట్టులో వినోదాన్ని అందించే ఆటగాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఉదయం టి20 మ్యాచ్‌లు జరగడం అనేది కొంత కొత్తగా అనిపిస్తున్నా దాని ప్రభావం ఉండకపోవచ్చు. నా కెరీర్‌ను మరింత పొడిగించుకునేందుకు విరామ సమయాల్లో ఫిట్‌నెస్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాను. కెప్టెన్సీ విషయంలో కుంబ్లే నుంచి నేను చాలా నేర్చుకున్నాను. క్రికెట్‌కు సంబంధించి అమెరికా ప్రత్యేక తరహా మార్కెట్. ఇక్కడ ఆటను అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలూ ఉన్నారుు.    -ధోని, భారత కెప్టెన్ 

 

 రా. గం. 7.30నుంచి  స్టార్ స్పోర్‌‌ట్స -1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement