కోలుకున్న శ్రీలంక | Sangakkara reaches milestone, Sri Lanka build lead | Sakshi
Sakshi News home page

కోలుకున్న శ్రీలంక

Published Mon, Jun 23 2014 1:20 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

కోలుకున్న శ్రీలంక - Sakshi

కోలుకున్న శ్రీలంక

 హెడింగ్లీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. మహేలా జయవర్ధనే (55 బ్యాటింగ్), కెప్టెన్ మ్యాథ్యూస్ (24 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. సంగక్కర (55), కరుణ రత్నే (45) రాణించారు. మొయిన్ అలీ, ప్లంకెట్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి.
 
  చేతిలో 4 వికెట్లు ఉన్న లంక ప్రస్తుతం 106 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు 320/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో మ్యాథ్యూస్, ఎరాంగ చెరో 4 వికెట్లు పడగొట్టారు. ఒక దశలో భారీ స్కోరు దిశగా పయనమైనా...లంక కట్టడి చేయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 108 పరుగులకే పరిమితమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement