రోహిత్తో గొడవ.. వార్నర్కు జరిమానా
మెల్బోర్న్: భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్కు జరిమానా విధించారు. దురుసు ప్రవర్తన మానుకోవాలని, మరోసారి ఇలా వ్యవహరించవద్దంటూ క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జేమ్స్ సదర్లాండ్ వార్నర్ను హెచ్చరించారు.
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా వార్నర్.. రోహిత్పై నోరుపారేసుకున్నాడు. రోహిత్, రైనా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓవర్ త్రోకు వీరిద్దరూ పరుగు తీశారు. ఆ సమయంలో రోహిత్, వార్నర్ మధ్య వాగ్వాదం జరిగింది. వార్నర్ తాను తప్పుచేసినట్టు అంగీకరించాడు. అతనికి మ్యాచ్ ఫీజులో సగం జరిమానాగా విధించారు.