
హాఫ్ సెంచరీ చేసిన వార్నర్
అడిలైడ్ : అడిలైడ్ టెస్ట్‌లో ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. 63 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేశాడు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో శుక్రవారం బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 105 పరుగులు చేసింది. వార్నర్ 61, వాట్సన్ 20 పరుగులతో ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ ఇప్పటివరకూ 178 పరుగుల ఆధిక్యంలో ఉంది.కాగా అంతకుముందు ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 444 పరుగులకు ఆలౌటైంది.