విజయంపై దృష్టి | IPL 9: Mumbai Indians, Sunrisers Hyderabad seek winning momentum | Sakshi
Sakshi News home page

విజయంపై దృష్టి

Published Mon, Apr 18 2016 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

విజయంపై దృష్టి

విజయంపై దృష్టి

నేడు ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ఢీ
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-9 సీజన్‌ను నిరాశాజనక రీతిలో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై గెలుపు బోణీ చేయాలని భావిస్తోంది. నేడు ఇక్కడి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. సన్‌రైజర్స్ ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా ఓడిపోగా, ముంబై మూడు ఆడి రెండింటిలో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో రైజర్స్ జట్టుకు వార్నర్, మోర్గాన్‌లు కీలకం కాగా...బౌలింగ్‌లో సన్ జట్టు విజయావకాశాలు ముస్తఫిజుర్‌పై ఆధారపడి ఉన్నాయి.

బ్యాటింగ్ బలహీనతను అధిగమించి హైదరాబాద్ సమష్టిగా రాణించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లోనూ ఓడితే సన్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. మరోవైపు ముంబై కూడా పెద్దగా ఫామ్‌లో లేదు. గుజరాత్‌తో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో కూడా ఆ జట్టు బ్యాట్స్‌మెన్ పేలవంగా ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మకు ఇతర ఆటగాళ్ల నుంచి సహకారం లభిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంది.  పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు వికెట్‌పై మంచి బౌన్స్ కూడా ఉంది. ఆదివారం ప్రాక్టీస్ సెషన్‌కు ముందు స్టేడియం పరిసరాల్లో భారీగా వర్షం పడి ఆగిపోయింది. మ్యాచ్ రోజు వర్షంతో ఇబ్బంది ఉండకపోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement