
కోహ్లి అండగా నిలవడం వల్లే...
కెప్టెన్ విరాట్ కోహ్లి ఇచ్చిన స్వేచ్ఛ కారణంగానే టెస్టుల్లో తనలోని అత్యుత్తమ ప్రదర్శన బయటపడుతోందని భారత పేసర్ ఉమేశ్ యాదవ్ వ్యాఖ్యానించాడు. బౌలర్ చేతికి బంతిని ఇవ్వగానే, ఫీల్డింగ్ ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ కూడా కోహ్లి ఇస్తాడని, ఆ ప్రణాళిక విఫలమైతే మరో వ్యూహంతో అండగా నిలిచేందుకు తాను ముందుకు వస్తాడని ఉమేశ్ అన్నాడు.
దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో విసిరే సంప్రదాయక అవుట్ స్వింగర్ తన బలమని, ఇప్పుడిప్పుడే ఇన్‌స్వింగ్, రివర్స్ స్వింగ్‌పై పట్టు పెంచుకుంటున్నానన్న ఉమేశ్... ఆసీస్ ఓపెనర్ వార్నర్‌కు బౌలింగ్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నానన్నాడు.