భారత గడ్డపై భారీ సమరానికి సన్నద్ధమవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బుధవారం తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టింది. జట్టు సభ్యులంతా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. కీలక ఆటగాళ్లు స్మిత్, వార్నర్, ఖాజా, మ్యాక్స్‌వెల్ నెట్స్‌లోని వేర్వేరు వికెట్‌లపై తమ ప్రాక్టీస్‌ను కొనసాగించగా, మరి కొందరు స్లిప్ క్యాచింగ్‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా స్థానిక స్పిన్ బౌలర్లతో పాటు జట్టు స్పిన్ కన్సల్టెంట్ శ్రీధరన్ శ్రీరామ్ బౌలింగ్‌లో ఆసీస్ క్రికెటర్లంతా స్పిన్‌ను ఆడటంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’తో ఆస్ట్రేలియా తలపడుతుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు ఈ నెల 23 నుంచి పుణేలో జరుగుతుంది.
Published Thu, Feb 16 2017 7:24 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement