భారత స్టార్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ విరాట్ కోహ్లి తన అద్భుత కెరీర్‌లో మరో గొప్ప ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో కోహ్లి చిరస్మరణీయ బ్యాటింగ్ తర్వాత కూడా భారత్ ఓటమి పాలైంది.