Australian Cricket Team
-
Urmila Rosario: అవును... మన అమ్మాయే!
ఫైనల్ మ్యాచ్‌లో మన జట్టు ఓటమి చెందిన బాధలో ఆమె పెద్దగా ఎవరికంటా పడలేదుగానీ... ఆ తరువాత మాత్రం ‘ఎవరీ అమ్మాయి?’ అనుకున్నారు చాలామంది. గెలుపు తరువాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పక్కన ప్రముఖంగా కనిపించిన ఆ అమ్మాయి పేరు... ఊర్మిళా రోసారియో. ఎవరీ ఊర్మిళ? ఊర్మిళా రోసారియో ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ మేనేజర్. ఆమె తల్లిదండ్రులు ఐవీ, వాలెంటైన్ రోసారియోలది కర్ణాటకలోని మంగళూరుకు సమీపంలోని కిన్నిగోలి ప్రాంతం. ఐవీ, వాలంటైన్లు ఖతార్‌లోని దోహాలో ఉద్యోగం చేస్తున్న కాలంలో ఊర్మిళ జన్మించింది. ఊర్మిళకు చిన్నప్పటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం. స్కూలు రోజుల్లో క్రికెట్ కంటే బాస్కెట్‌బాల్, టెన్నిస్ బాగా ఆడేది. బంగీ జంపింగ్ అంటే ఇష్టం. ఖతార్ టెన్నిస్ ఫెడరేషన్లో మూడు సంవత్సరాలు పనిచేసింది. కార్నెగీ మెలన్ యూనివర్శిటీ లో బీబీఏ చేసిన ఊర్మిళ ఆ తరువాత ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా పనిచేసింది. ఒక నాన్–ఆస్ట్రేలియన్‌కు టీమ్ మేనేజర్ బాధ్యతలు అప్పగించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ నేపథ్యంలో క్రికెట్ నుంచి కొన్ని నెలల పాటు విరామం తీసుకొని ఖతార్‌లో ఫుట్‌బాల్ స్టేడియం నిర్వాహణ బాధ్యతలు చూసుకుంది. ఆ తరువాత మళ్లీ ఆస్ట్రేలియాకు వచ్చింది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మేనేజర్‌గా ఊర్మిళ పనితీరు, హిందీ, కన్నడ, కొంకణి... మొదలైన భారతీయ భాషలలో నైపుణ్యం వరల్డ్‌కప్ టూర్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మేనేజర్‌గా ఎంపిక చేయడానికి కారణం అయింది. ఏడు సంవత్సరాల క్రితం ఊర్మిళ తల్లిదండ్రులు దోహా నుంచి మన దేశానికి వచ్చారు. కాఫీ ఎస్టేట్ కొనుగోలు చేసి కర్ణాటకలోని సకలేష్‌పూర్‌లో స్థిరపడ్డారు. ‘క్రికెట్‌తో ఒకప్పుడు నాకు పెద్దగా పరిచయం లేదు. అలాంటి నాకు క్రికెట్‌తో ఇంత అనుబంధం ఏర్పడడం ఆశ్చర్యంగా ఉంది’ అని నవ్వుతూ అంటుంది ఊర్మిల. నవ్వడం సరే, క్రికెట్ టీమ్ మేనేజర్ అంటే మాటలా? ఒక్కమాటలో చెప్పాలంటే... ‘రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్’ దీనిలో వందకు వంద మార్కులు కొట్టేసింది ఊర్మిళ. ఊర్మిళ గత మార్చిలో తల్లిదండ్రులను చూడడానికి మనదేశానికి వచ్చింది. ఊర్మిళ ఇక్కడ ఉంటే కాఫీ ఎస్టేట్‌లో చిన్న చిన్న పనులు కూడా చేస్తుంది. ఆమె పక్కన ఉంటే తల్లిదండ్రులకు పండగే. కూతురి ఉన్నతి గురించి పెద్దగా మాట్లాడకపోయినా ‘ఫైనల్ మ్యాచ్ చూడడానికి అహ్మదాబాద్‌కు వెళ్లాలనుకున్నాం. దురదృష్టవశాత్తు మా ఎస్టేట్ దాటి వెళ్లలేకపోయాం’ అంటున్నారు ఊర్మిళ తల్లిదండ్రులు. ఫైనల్ మ్యాచ్ మిస్ అయితే ఏమిటి? ఏదో ఒకరోజు కాఫీ ఎస్టేట్‌కు ఊర్మిళ వస్తుంది కదా! ఆ మ్యాచ్‌ను కళ్లకు కడుతుంది కదా! ఇక దిగులెందుకు!! -
శతకోటి జనుల స్వప్నభంగం
పరమపద సోపానపటంలో చివరి దాకా వెళ్ళి, మరొక్క గడిలో లక్ష్యాన్ని అందుకుంటామనగా పెద్ద పాము నోటిలో పడితే ఎలా ఉంటుంది? విజయం అంచుల దాకా వెళ్ళి, ఓటమి కోరల పాలబడితే ఎవరి మానసిక పరిస్థితి అయినా ఏమవుతుంది? వరల్డ్ కప్‌లో అప్రతిహతంగా దూసుకెళ్ళి, తీరా ఆదివారం ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తయిన భారత క్రికెట్ జట్టు పరిస్థితీ, 140 కోట్ల మంది భారతీయుల మనఃస్థితీ అంతే. లక్షా 32 వేల మంది జనంతో క్రిక్కిరిసిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియమ్లో నిశ్శబ్దం తాండవించగా, ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచి, ఆరో ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్‌ను ఎగరేసుకుపోయింది. శత కోటి భారతీయుల స్వప్నం భంగమైంది. ఆసీస్‌కు ఇది ఆరో వరల్డ్ కప్ టైటిలైతే, ఆ దేశంతో ఇరవై ఏళ్ళ క్రితం దక్షిణాఫ్రికాలో ప్రపంచ కప్ ఫైనల్స్‌లో తలపడినప్పటి లానే భారత్‌కు మళ్ళీ చేదు అనుభవమే ఎదురైంది. నిజానికి, ఈసారి భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగకపోయినా, టోర్నీ ఆరంభం నుంచి ఆటలో ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో గ్రూప్ దశ నుంచి ఎదురన్నది లేకుండా సాగింది. 2019 సెమీస్‌లో తమను ఓడించిన న్యూజిలాండ్‌ను ఈసారి సెమీస్‌లో తాను మట్టికరిపించి, ఫైనల్‌కు చేరింది. వరుస విజయాలతో కప్పు భారత్‌దే అన్న నమ్మకం కలిగించింది. తీరా ఆఖరి మహా సంగ్రామంలో తడబడింది. ఇక, తడబడుతూ ఈ టోర్నీని మొదలుపెట్టి, ఆఖరికి అఫ్గానిస్తాన్ చేతిలో సైతం ఓటమి కోరల నుంచి మ్యాక్స్‌వెల్ అసాధారణ డబుల్ సెంచరీతో బయటపడ్డ ఆసీస్ ఆఖరికి విజేత అయింది. తనదైన రోజున మన జట్టు మెడలు వంచి, టైటిల్‌ను సొంతం చేసుకుంది. టోర్నీలో అత్యధిక పరుగులు (కోహ్లీ – 765 రన్స్), అత్యధిక వికెట్లు (షమీ– 7 మ్యాచ్‌లలో 24 వికెట్లు), అత్యుత్తమ విజయ శాతం (90.9) లాంటి ఘనతలు సాధించిన భారత జట్టు ఆఖరి మెట్టుపైకి చేరకుండానే ఆగిపోయింది. అలాగని మునుపెన్నడూ లేనంత బలంగా కనిపిస్తున్న ఈ జట్టును తప్పుబట్టాల్సిన పని లేదు. అప్రతిహత విజయాలతో, అసాధారణ ప్రతిభా ప్రదర్శనతో, గత నెలన్నర పైగా కోట్లాది అభిమానులకు ఆనందోద్వేగాల్ని పంచిన భారత జట్టును తక్కువ చేయలేం. అసలు ప్రపంచ కప్‌లో ఫైనల్స్ దాకా చేరడమే గొప్ప.అలాగే, ఆటలో గెలుపోటములు సహజమనీ, విజేత ఒకరే ఉంటారనీ గుర్తెరగాలి. కాకపోతే, లోటుపాట్లేమిటన్నది కూడా సమీక్షించుకోవాలి. పేరున్న వేదికల్ని సైతం పక్కకునెట్టి, పాలకపక్ష పెద్దలు, బీసీసీఐ సారథుల స్వస్థలం లాంటి ఇతరేతర కారణాలతో అహ్మదాబాద్‌ను ఫైనల్స్‌కు వేదిక చేయడం మన కురచబుద్ధి రాజకీయాల తప్పు. ఇరుజట్లకూ సమాన విజయావకాశాలు కల్పించకుండా, టాస్‌ను కీలకం చేసి, మ్యాచ్‌ను లాటరీగా మార్చేసే పిచ్‌ను తుదిపోరుకు సిద్ధం చేయడం మరో తప్పు. ఇవన్నీ కొంప ముంచాయి. ప్రపంచ టోర్నీల్లో విజేతగా నిలిచే విషయంలో భారత్ వెనుకబడే ఉంది. ఈసారీ ఆ లోటు తీర లేదు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన తర్వాత దశాబ్ద కాలంగా మరో ప్రపంచ టైటిల్ ఏదీ మనం గెలవలేదు. పదేళ్ళ లెక్క తీస్తే, సెమీస్‌లో 3 సార్లు, ఫైనల్స్‌లో 5 సార్లు... మొత్తం 8 కీలక మ్యాచ్‌లలో మనం చతికిలపడ్డాం. భారీ గేమ్స్ తాలూకు ఒత్తిడి, ఓటమి భయం, జట్టు ఆలోచనా దృక్పథం... ఇలా అనేకం అందుకు కారణాలు కావచ్చు. అంతర్జాతీయ వేదికపై జెండా ఎగరేసేందుకు మనలోని ఈ అంతర్గత ప్రత్యర్థులపై ముందు విజయం సాధించాలి. అందుకెలాంటి ప్రయత్నం, శ్రమ, శిక్షణ అవసరమన్న దానిపై క్రికెట్ యంత్రాంగం దృష్టి పెట్టాలి. కలబడి ఆడడమే కాదు... ఒత్తిడిలోనూ నిలబడి గెలవడమూ కీలకమేనని ఐపీఎల్ అలవాటైన నవతరానికి నూరిపోయాలి. టాస్ మొదలు ఏదీ కలసిరాని చావో రేవో మ్యాచ్‌లో పదో ఓవర్ నుంచి యాభయ్యో ఓవర్ మధ్య 40 ఓవర్లలో 4 బౌండరీలే భారత బ్యాట్స్మన్లు కొట్టారన్న లెక్క ఆశ్చర్యపరుస్తుంది. బ్యాటింగ్‌లో అవతల వికెట్లు టపటపా పడుతుంటే ఒక్కో పరుగుతో, భాగస్వామ్యం, తద్వారా భారీ ఇన్నింగ్స్ నిర్మించే ఓర్పు కావాలి. బంతిని బలంగా బాదడం కన్నా ప్రత్యర్థి ఫీల్డర్ల మధ్య ఖాళీల్లో కొట్టే నేర్పు రావాలి. అన్నీ తెలిసిన భారత్ ఆఖరి రోజున ఆ పనిలో విఫలమైంది. బలంగా కనిపించే జట్టులో తొలి అయిదుగురి తర్వాత బ్యాటింగ్ బలహీనతలూ బయటపడ్డాయి. కనీసం మరో 40 – 50 పరుగులు చేసివుంటే, బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో మరింత రాణించివుంటే కథ మరోలా ఉండేదన్న మాటలు వినిపిస్తున్నది అందుకే! అలాగని, ఆసీస్ తాజా విజయాన్ని తక్కువ చేయలేం. ప్రతి కీలక సందర్భంలో సర్వశక్తులూ ఒడ్డే ఆ జట్టు పోరాటస్ఫూర్తిని అలవరచుకోవడమే ఎప్పటికైనా మనకు ముఖ్యం. ఆటలను పిచ్చిగా ప్రేమించే, కేవలం 2.5 కోట్ల జనాభా గల ఆ దేశం తరగని ప్రేరణ. మన జట్టు గెలవాలనుకోవడం సబబే కానీ, అన్ని రోజులూ, అన్ని మ్యాచ్‌లూ మనమే గెలవాల నుకోవడం అత్యాశ. అంచనాలు, అనవసర ఒత్తిళ్ళు పెంచేయడం మన లోపమే. కొమ్ములు తిరిగిన ఆటగాళ్ళకైనా కలసిరాని రోజులూ కొన్ని ఉంటాయి. భారత క్రికెట్లో మొన్న ఆదివారం అలాంటిదే. ప్రత్యర్థి ఆటగాడు సెంచరీ కొట్టినా, ఆ జట్టు కెప్టెన్ కప్ అందుకున్నా అభినందించలేనంత సంకుచిత ధోరణి క్రీడాస్ఫూర్తి కానేరదు. అహ్మదాబాద్ సాక్షిగా అందరం ముందు అది తెలుసుకోవాలి. అత్యు త్తమ బౌలింగ్ దాడి, కోహ్లీ అపూర్వ ఫామ్, రోహిత్ ఘనసారథ్యం లాంటి గొప్పలెన్నో ఈ టోర్నీ మిగిల్చిందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడిక ప్రతిభకు పదును పెట్టుకుంటూనే, మనదైన మరో రోజు కోసం ఆగుదాం. వచ్చే వరల్డ్‌కప్‌ను ముద్దాడేందుకు నాలుగేళ్ళు నిరీక్షిద్దాం. శారీరకంగా, మానసికంగా మన జట్టు అందుకు సన్నద్ధమయ్యేందుకు సహకరిద్దాం. నెక్స్›్ట టైమ్ బెటర్ లక్... టీమిండియా! -
మన తీరు ఇలా ఉండాలా?
ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉస్మాన్ ఖ్వాజా పట్ల మనం వ్యవహరించిన తీరు సంకుచితంగా ఉంది. అతడికి ద్వంద్వ జాతీయత ఉంది. అటు పాకిస్తానీయుడి గానూ, ఇటు ఆస్ట్రేలియన్ పౌరుడిగానూ ఉంటున్నాడు. అది మన ప్రభుత్వ కళ్లలో అతడిని అనుమానితుడిని చేసింది. అందుకే ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుతో కలిసి భారత్ పర్యటనకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, వెంటనే అనుమతి దక్కలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, మానవ హక్కుల సూత్రబద్ధ సమర్థకురాలిగా ఉంటున్నందుకు భారత్ గర్వపడుతుంది. మనం ఈ స్వీయ–ప్రతిష్ఠను నిలుపుకొనేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన పట్ల పాకిస్తాన్ ప్రవర్తన కూడా అలాగే ఉందనే వాదన ఒకటుంది. మన సొంత ప్రమాణాలను నిర్దేశించుకోవడానికి మన పొరుగు వాడి ప్రవర్తన ప్రమాణం అవుతుందా? పాకిస్తాన్ పౌరులనూ, వారి భయంకరులైన పాలకులనూ మనం వేరు చేసి చూడకూడదా? దక్షిణాసియా ప్రాంతంలో కీలక శక్తిగా తనను తాను పరిణించుకుంటున్న దేశం, ఐరాసలో అత్యున్నత సీటును కోరుకుంటున్న దేశం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? మన దేశాన్ని సందర్శించాలని కోరుకునే పాకిస్తానీయుల పట్ల మనం ఎందుకు చీకాకుగా వ్యవ హరిస్తాం? అయితే మన పట్ల వాళ్ల ప్రవర్తన కూడా అలాగే ఉందనే వాదన ఒకటుంది. కానీ నా అనుభవం అలా లేదని నేను చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా ఇలాంటి వాదన సముచితమైనది కాదు. అది మనకు విలువనివ్వదు కూడా! మొదటి విషయం: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగానూ, మానవ హక్కుల విషయంలో సూత్రబద్ధ సమర్థకురాలిగానూ ఉంటున్నందుకు భారత్ గర్వపడుతుంది. కానీ మనం దీన్ని గురించి చెప్పినట్లయితే పాకిస్తాన్ అసలు నమ్మదు. అయితే మనం కూడా మన స్వీయ– ప్రతిష్ఠను నిలుపుకొనేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన సొంత ప్రమాణాలను నిర్దేశించు కోవడానికి మన పొరుగువాడి ప్రవర్తన ప్రమాణం అవుతుందా? అలా కాదంటే– ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా కాకుండా, దానికి భిన్నంగా వ్యవహ రించడం ద్వారా మనం మరింత మెరుగైనవాళ్లమని దృఢ నిరూపణ చేయాల్సి ఉంటుంది. అనుమానపు చూపు అద్భుతమైన ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖ్వాజా పట్ల మనం వ్యవహరించిన తీరు నేను వర్ణించిన రోత ప్రవర్తనకు ప్రతిరూపమే. నిజానికి ఇది అంతకుమించిన ఘోరమైన విషయం. సంకు చితంగా, ద్వేషపూరితంగా, మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నట్లుగా ఉంది. ఇలాంటి వైఖరి భార త్ను పేలవంగా చూపిస్తుంది. దీంట్లోని అత్యంత ఘోరమైన విషయం ఏమిటంటే, ఇదంతా మనకు మనం కలిగించుకున్న నష్టమే. పాకిస్తాన్లో పుట్టిన ఖ్వాజా నాలుగేళ్ల వయసులో ఉండగా కుటుంబంతోపాటు ఆస్ట్రేలి యాకు వలస వెళ్లాడు. ఈరోజు అతడికి ద్వంద్వ జాతీయత ఉంది. అతడు అటు పాకిస్తానీయుడి గానూ, ఇటు ఆస్ట్రేలియన్ పౌరుడిగానూ ఉంటు న్నాడు. అది మన ప్రభుత్వ కళ్లలో అనుమానితుడిని చేసింది. ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుతో కలిసి భారత్ పర్యటనకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, అతడికి వెంటనే అనుమతి దక్కలేదు. అది ఎంత ఆలస్యమైందంటే, ఫిబ్రవరి 1న ఖ్వాజా లేకుండానే ఆస్ట్రేలియా టీమ్ ఇండియాకు వచ్చేసింది. ఆస్ట్రేలియన్ క్రికెట్ పాలనా యంత్రాంగం నిరసన తెలిపిన తర్వాతే ఖ్వాజా వీసాను పొంద గలిగాడు. ప్రభుత్వాల ప్రామాణిక ధోరణి భారతదేశంలో మనలో ఏ కొద్దిమందికో ఈ విషయం గురించి తెలుసు. అందులో బహుశా చాలా కొద్దిమంది దీని గురించి కలవరపడుతుండవచ్చు. కానీ ఆస్ట్రేలియాలో ఇలా ఉండదు. బీజేపీ ఖ్వాజాను ఆస్ట్రేలియా అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిలా కాకుండా పాకిస్తాన్లో పుట్టిన ముస్లింలా చూస్తోందని ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’లో రాసే దేశ అత్యుత్తమ క్రికెట్ వ్యాఖ్యాతల్లో ఒకరైన మాల్కమ్ కోన్ రాశారు. వాస్తవం ఇంతకంటే దారుణంగా ఉంది. భారతీయ వీసాను పొందడంలో సమస్యలు ఎదుర్కోవడం ఖ్వాజాకు ఇదే తొలిసారి కాదు. ‘ది గార్డియన్’ పత్రిక ప్రకారం– మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా 2011 లోనే ఈ అనుభవం అతడికి ఎదురైంది. పాకిస్తానీ యుల పట్ల ద్వేషపూరిత వైఖరిని ప్రదర్శించడం భారత ప్రభుత్వాలకు ఒక ప్రామాణికమైన ఆచర ణగా మారిపోయిందని ఇది స్పష్టం చేస్తోంది. ద్వంద్వ పౌరసత్వం ఉన్న పాకిస్తానీయుడు, భారతీయ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు నన్ను వివరించనివ్వండి. ఆ వ్యక్తి లండన్, న్యూయార్క్ లేదా దుబాయ్ నివాసి అయినప్పటికీ, వారి పాకిస్తానీ పాస్‌పోర్ట్‌పైనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది తప్ప మరొక పాస్‌పోర్ట్ మీద కాదు. దరఖాస్తు సమర్పించగానే భారతీయ రాయబార కార్యా లయం దాన్ని ఢిల్లీకి పంపిస్తుంది. అక్కడ విదేశీ వ్యవహారాల శాఖ కాకుండా, హోమ్ మంత్రిత్వ శాఖ దాన్ని నిర్ణయిస్తుంది. దానికి కొన్ని నెలలు పడుతుంది. మూడు నెలల్లోగా నిర్ణయం వస్తుందని ఆశించవద్దని దరఖాస్తుదారులకు ఆటోమేటిక్‌గా చెబుతారు. అఖండ భారత్ ఇలాగా? తరచుగా నేను మెజారిటీ కేసులను తడిమి చూశాను. ఎక్కడా స్పందన లేదు. అలాంటి సందర్భాల్లో ఏ వార్తా రాకపోవడం మంచి వార్త కాదు. ఒకవేళ వచ్చిదంటే, ఎవరో మీ కోసం తీగ లాగగలగాలి. అదీ మీరు అదృష్టవంతులైతే! కానీ ఎంతమంది పాకిస్తానీయులకు అలాంటివి చేసి పెట్టేవారు దొరుకుతారు? తుది ఫలితం ఏమిటంటే – భారత్ సందర్శించడానికి చాలా తక్కువ మంది మాత్రమే అనుమతి పొందుతారు. ఒకప్పుడు –అంటే చాలా కాలం క్రితం కాదు– మన తోటి దేశవాసులుగా ఉండిన వారితో మనం నిజంగా వ్యవహరించవలసిన తీరు ఇదేనా? మరీ ముఖ్యంగా, అఖండ భారత్‌పై మన ప్రకటనలకు (సమర్థన అటుండనీ) మద్దతు గెల్చుకోవడానికి మనం వెళుతున్న మార్గం ఇదేనా? దక్షిణాసియా ప్రాంతంలో కీలక శక్తిగా తనను తాను పరిగణించుకుంటున్న దేశం, ఐక్యరాజ్యసమితిలో అత్యున్నత సీటును కోరుకుంటున్న దేశం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా ‘అవును’ అనేది సమాధానం అయితే అది నేను నమ్మలేని విషయం అవుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వంతో మనకు దశాబ్దాలుగా సమస్యలు ఉన్నాయనడంలో సందేహమే లేదు. కానీ నిజం ఏమిటంటే పాకిస్తాన్ ప్రజల విషయంలో కూడా ఇది నిజమేనా? ఈ సందర్భంలో దేశ పౌరులనూ, వారి భయంకరులైన పాలకులనూ మనం వేరు చేసి చూడకూడదా? లేదా మనం అలాంటి సులభమైన సూక్ష్మ విషయాన్ని కూడా గ్రహించలేనంత అసమర్థులమా? ఈ విషయంలో నిజం ఏదంటే, మనం వీసాలను నిరాకరించడం ద్వారా పాకిస్తానీయులు ఇబ్బందిపడి ఉండవచ్చు లేదా పడకపోయి ఉండ వచ్చు. కానీ ఒక దేశంగా మనం (భారత ప్రభుత్వాలు మాత్రమే కాదు, భారత ప్రజలం కూడా) వికారంగా కనిపించడం లేదా? కాబట్టే మన కోసమైనా మనం ఇలాంటి ధోరణిని తప్పక ఆపివేయాలి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Andrew Symonds: ఆండ్రూ సైమండ్స్ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం
క్వీన్స్‌ల్యాండ్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ మృతి చెందాడు. గత రాత్రి టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో 46 ఏళ్ల సైమండ్స్ మరణించాడు. 1998లో ఆస్ట్రేలియా తరపున వన్డే ఇంటర్నేషనల్‌లో అరంగేట్రం చేసిన సైమండ్స్.. దిగ్గజ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 198 వన్డేలు ఆడిన సైమండ్స్.. 2003, 2007 వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే సైమండ్స్ మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఐసీసీ, ఆసీస్ మాజీ ఆటగాళ్లు ఆడమ్ గ్రిల్‌కిస్ట్, గిల్లెస్పీ, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఫ్లెమింగ్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విటర్ ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. Think of your most loyal, fun, loving friend who would do anything for you. That’s Roy. 💔😞 — Adam Gilchrist (@gilly381) May 15, 2022 Shocking news to wake up to here in India. Rest in peace my dear friend. Such tragic news 💔🥲 pic.twitter.com/pBWEqVO6IY — VVS Laxman (@VVSLaxman281) May 15, 2022 'కారు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మరణించారని తెలిసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. మేము మైదానంలోనూ బయట మంచి సంబంధాన్ని పంచుకున్నాము. వారి కుటుంబానికి దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను' అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశాడు. Devastated to hear about Andrew Symonds passing away in a car crash in Australia. We shared a great relationship on & off the field. Thoughts & prayers with the family. #AndrewSymonds pic.twitter.com/QMZMCwLdZs — Shoaib Akhtar (@shoaib100mph) May 14, 2022 ఆస్ట్రేలియా క్రికెట్ మరో అత్యుత్తమైన ఆటగాడని కోల్పోయింది. రెండు ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్రపోషించిన క్వీన్స్ ల్యాండర్ సైమండ్స్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడంతో మేము తీవ్ర దిగ్భ్రాంతి చెందాము. ఈ విషాద సమయంలో సైమండ్స్ కుటుంబానికి క్రికెట్ ఆస్ట్రేలియా, స్నేహితులు, సన్నిహితులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. Vale Andrew Symonds. We are shocked and saddened by the loss of the loveable Queenslander, who has tragically passed away at the age of 46. pic.twitter.com/ZAn8lllskK — Cricket Australia (@CricketAus) May 15, 2022 దిగ్గజ క్రికెటర్ గిల్‌క్రిస్ట్, ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీ కూడా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేమంతా నిన్ను మిస్ అవుతున్నాం అంటూ ట్వీట్ చేశారు. Horrendous news to wake up to. Utterly devastated. We are all gonna miss you mate.☹️ #RIPRoy — Jason Gillespie 🌱 (@dizzy259) May 14, 2022 చదవండి: (క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆసిస్ దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి) Deeply saddened by the passing of Andrew Symonds. 💔#RIPRoy pic.twitter.com/qFYbJI2V8y — Mumbai Indians (@mipaltan) May 15, 2022 ఆండ్రూ సైమండ్స్ మృతి పట్ల భారత క్రికెటర్ విరాట్ కోహ్లి సంతాపం వ్యక్తం చేశాడు. ఈ వార్త తనని దిగ్భ్రాంతికి గురిచేసిందన్న కోహ్లి.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని, ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించే శక్తిని సైమండ్స్ కుటుంబ సభ్యులకు దేవుడు అందివ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీటర్ ద్వారా తన సంతాపాన్ని తెలిపాడు. Shocking and saddening to hear of Andrew Symonds passing. May his soul RIP and God give strength to his family in this difficult moment. 🙏🏻 — Virat Kohli (@imVkohli) May 15, 2022 -
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ మృతి
-
క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆసిస్ దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి
ఆస్ట్రేలియా క్రికెట్ ప్రేమికులకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ లెజెండరీ క్రికెటర్, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం రాత్రి టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అకాల మృతి చెందగా.. ఇప్పుడు సైమండ్స్ మృతితో యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. తన ఆటతో అనతి కాలంలోనే ఆస్ట్రేలియా టీమ్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా సైమండ్స్ పేరు తెచ్చుకున్నారు. కెరీర్లో 198 వన్డేలు ఆడిన సైమండ్స్.. ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. సైమండ్స్ అకాల మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఆసీస్ దిగ్గజ ఆటగాడు అడమ్ గ్రిల్‌కిస్ట్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, పాక్ బౌలర్ షోయబ్ అక్తర్ సంతాపం తెలుపుతూ టీట్లు చేశారు. సైమండ్స్ కెరీర్.. 1998లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. మొత్తం 198 వన్డేల్లో 5088 పరుగులు చేసిన సైమండ్స్.. అందులో ఆరు సెంచరీలు, 30 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఆల్‌రౌండర్.. 133 వికెట్లు పడగొట్టాడు. జట్టు విజయంలో చాలా సార్లు కీలక పాత్ర పోషించాడు. 2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సైమండ్స్.. మొత్తం 26 మ్యాచ్‌ల్లో 1463 పరుగులు చేయగా.. వాటిలో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 పరంగా 14 మ్యాచ్‌ల్లో.. రెండు హాఫ్ సెంచరీలతో 337 పరుగులు చేశాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్లో సైమండ్స్‌ను డెక్కన్ ఛార్జర్స్ రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు సైమండ్స్ వీడ్కోలు పలికాడు. This really hurts. #roy #rip — Adam Gilchrist (@gilly381) May 14, 2022 Shocking news to wake up to here in India. Rest in peace my dear friend. Such tragic news 💔🥲 pic.twitter.com/pBWEqVO6IY — VVS Laxman (@VVSLaxman281) May 15, 2022 Vale Andrew Symonds. We are shocked and saddened by the loss of the loveable Queenslander, who has tragically passed away at the age of 46. pic.twitter.com/ZAn8lllskK — Cricket Australia (@CricketAus) May 15, 2022 Devastated to hear about Andrew Symonds passing away in a car crash in Australia. We shared a great relationship on & off the field. Thoughts & prayers with the family. #AndrewSymonds pic.twitter.com/QMZMCwLdZs — Shoaib Akhtar (@shoaib100mph) May 14, 2022 చదవండి: IPL 2022: రివ్యూకు సిగ్నల్ చేయడం మర్చిపోయాడు.. పాపం రింకూ సింగ్..! -
అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఎవరీ నివేథన్ రాధాకృష్ణన్
అండర్-19 ప్రపంచకప్‌లో ఒక భారత సంతతి కుర్రాడు అదరగొట్టాడు. ఆస్ట్రేలియన్ టీమ్‌లో ఆడుతున్న ఆ కుర్రాడు యాంబిడెక్స్‌ట్రస్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. తనదైన బౌలింగ్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అతనే నివేథన్ రాధాకృష్ణన్. వెస్టిండీస్ వేదికగా సాగుతున్న అండర్-19 ప్రపంచకప్ మెగా ఈవెంట్లో మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా యువ జట్టు అఫ్గనిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన నివేథన్ రాధాకృష్ణన్ ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: ఆఖరి వరకు ఉత్కంఠ.. అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఆసీస్‌దే విజయం ముందుగా బౌలింగ్‌లో 31 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. అతని దెబ్బకు అఫ్గనిస్తాన్ 201 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్ కాంప్‌బెల్ కెలావే(51 పరుగులు) అర్ధ శతకంతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నివేథన్ రాధాకృష్ణన్ 66 పరుగులు సాధించాడు. ఆ తర్వాత టపాటపా వికెట్లు పడ్డాయి. అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో విజయం ఎట్టకేలకు ఆసీస్‌నే వరించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడోస్థానంతో అండర్-19 ప్రపంచకప్‌ను ముగించింది. ఎవరీ నివేథన్ రాధాకృష్ణన్.. ►2013లో నివేథన్ రాధాకృష్ణన్ భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చి సిడ్నీలో స్థిరపడ్డాడు. ►ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆధ్వర్యంలో బౌలింగ్‌లో రాటు దేలాడు. ►అండర్-16 లెవెల్ ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించి వైవిధ్యమైన బౌలింగ్‌తో తొలిసారి గుర్తింపు పొందాడు ►ఎన్ఎస్డబ్ల్యూ ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో ఆడిన నివేథన్ రాధాకృష్ణన్ ఆ సిరీస్‌లో 898 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఎన్ఎస్డబ్ల్యూ, తస్మానియా క్రికెట్ నుంచి అవార్డులతో పాటు అవకాశాలు అందుకున్నాడు. ►తస్మానియా క్రికెట్ తరపున ఈ సీజన్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన నివేథన్ రాధాకృష్ణన్ 622 పరుగులతో రాణించాడు. చదవండి: జట్టులో స్టార్స్ లేరు.. వందకు వంద శాతం ఎఫర్ట్ పెడతాం.. కోహ్లి మాకు ఏం చెప్పాడంటే.. సాధారణంగా స్పిన్ బౌలర్ అయిన రాధాకృష్ణన్‌లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అతను రెండు చేతులతో(ఎడమ, కుడి) బౌలింగ్ చేయడంలో దిట్ట. దీంతో అతన్ని లెఫ్టార్మ్ ? లేక రైట్ ఆర్మ్? స్పిన్నర్ అనాలా అనేది సందిగ్దంగా మారింది. క్రికెట్లో ఇలాంటి బౌలర్లు ఉండడం అరదుగా జరుగుతుంటుంది. బౌలింగ్‌లో వైవిధ్యత చూపించడం కోసం ఏ బౌలర్ అయినా ఒకే శైలి బౌలింగ్‌కు పరిమితమవుతాడు. కానీ నివేథన్ రాధాకృష్ణన్ మాత్రం అటు లెఫ్ట్.. ఇటు రైట్ ఆర్మ్‌తో బౌలింగ్ చేస్తూ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. యాంబిడెక్స్‌ట్రస్ క్రికెటర్ అంటే... సాధారణంగా ఏకకాలంలో లెఫ్టార్మ్, రైట్ ఆర్మ్ బౌలింగ్ చేయగలిగిన వారిని యాంబిడెక్స్‌ట్రస్ క్రికెటర్ అని పిలుస్తారు. అయితే ప్రస్తుత క్రికెట్లో ఇలాంటి శైలి అరుదుగా కనిపిస్తుంది. తాజాగా నివేథన్ రాధాకృష్ణన్ వార్తల్లో నిలవడం ద్వారా యాంబిడెక్స్‌ట్రస్ క్రికెటర్ పదం మరోసారి వెలుగులోకి వచ్చింది. క్రికెట్ చరిత్రలో యాంబిడెక్స్‌ట్రస్ క్రికెటర్లు చాలా మందే ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఒక ఐదుగురి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపించాయి. హనీఫ్ మొహ్మద్(పాకిస్తాన్) పాకిస్తాన్ బ్యాటింగ్‌లో సూపర్ స్టార్‌గా వెలుగొందిన హనీఫ్ మొహ్మద్ నిజానికి రెగ్యులర్ బౌలర్ కాదు. కానీ పార్ట్‌టైమ్ బౌలింగ్ చేసిన హనీఫ్ రెండు చేతులతో బౌలింగ్ చేయగలడు. పాకిస్తాన్ తరపున 55 టెస్టు మ్యాచ్‌ల్లో 3915 పరుగులు చేశాడు. గ్రహం గూచ్(ఇంగ్లండ్) ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం గ్రహం గూచ్ కూడా యాంబిడెక్స్‌ట్రస్ ఆటగాడే. బ్యాటింగ్‌లో ఎన్నోసార్లు మెరుపులు మెరిపించిన గ్రహం గూచ్.. రైట్ ఆర్మ్.. లెఫ్ట్ఆర్మ్ మీడియం పేస్‌తో 23 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్ తరపున గ్రహం గూచ్ 118 టెస్టుల్లో 8900 పరుగులు.. 125 వన్డేల్లో 4290 పరుగులు సాధించాడు. హసన్ తిలకరత్నే(శ్రీలంక) స్వతహాగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన హసన్ తిలకరత్నే ఒకానొక సమయంలో శ్రీలంక క్రికెట్లో రాణించాడు. లంక తరపున 83 టెస్టులు.. 200 వన్డేలు ఆడిన హసన్ తిలకరత్నే బౌలింగ్‌లో రైట్ ఆర్మ్ స్పిన్ ఎక్కువగా వేసేవాడు. కానీ 1996 వన్డే ప్రపంచకప్‌లో కెన్యాతో మ్యాచ్‌లో తిలకరత్నే ఆఖరి ఓవర్లో రైట్ ఆర్మ్.. లెఫ్టార్మ్ బౌలింగ్ చేసి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక 1996 వన్డే ప్రపంచకప్‌ను శ్రీలంక ఎగరేసుకపోయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కర్నేవార్(భారత్) విదర్భ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన అక్షయ్ కర్నేవార్ ప్రస్తుతం దేశవాలీలో లిస్ట్-ఏ, టి20 మ్యాచ్‌లు ఆడుతు బిజీగా గడుపుతున్నాడు. అక్షయ్ కర్నేవార్ లెఫ్ట్ ఆర్మ్.. రైట్ ఆర్మ్ బౌలింగ్ చేయడంలో సమర్థుడు. విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున అక్షయ్ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో 16 వికెట్లు తీసి సీజన్ బెస్ట్ నమోదు చేశాడు. కమిందు మెండిస్(శ్రీలంక) 17 ఏళ్ల కమిందు మెండిస్ శ్రీలంక తరపున రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్.. స్లో లెఫ్ట్ఆర్మ్ ఆర్థడోక్స్ బౌలింగ్ చేయడంలో దిట్ట. అండర్-19 వరల్డ్‌కప్‌లో లంక తరపున ప్రాతినిధ్యం వహించి కమిందు మెండిస్ ఆకట్టుకున్నాడు. -
భారీ విజయంతో ఆసీస్ బోణీ
బ్రిస్బేన్: తమకెంతో కలిసొచ్చిన బ్రిస్బేన్ మైదానంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అజేయ రికార్డును కొనసాగించింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓవర్‌నైట్ స్కోరు 114/0తో ఆట చివరిరోజు సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 16 ఓవర్లు ఆడి విజయానికి అవసరమైన 56 పరుగులను సాధించింది. ఓపెనర్లు వార్నర్ (119 బంతుల్లో 87 నాటౌట్; 10 ఫోర్లు), బాంక్రాఫ్ట్ (182 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, ఒక సిక్స్) తొలి వికెట్‌కు 173 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించి ఆసీస్ విజయాన్ని ఖాయం చేశారు. ఓవరాల్‌గా బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాకిది 22వ విజయం. రెండో టెస్టు డిసెంబర్ 2 నుంచి అడిలైడ్‌లో జరుగుతుంది. -
ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై రాళ్ల దాడి
గువాహటి : రెండో ట్వంటీ-20 మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్‌కు వెళ్తున్న ఆసీస్ క్రికెటర్ల బస్సుపై మంగళవారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో బస్సు అద్దం ధ్వంసమైంది. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ ట్వీట్ చేశారు. హోటల్‌కు వెళ్తున్న దారిలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై రాయి విసరడం ఆందోళన కలిగించిందని పేర్కొన్నారు. పగిలిన బస్సు అద్దం ఫొటోను కూడా ట్వీట్‌కు జత చేశారు ఫించ్. రాయి విసిరినప్పుడు విండో సీట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని క్రికెట్ ఆస్ట్రేలియా తన వెబ్సైట్లో పేర్కొంది. కానీ, ఈ ఘటన క్రికెటర్లను ఆందోళనకు గురి చేసినట్లు తెలిపింది. ఘటనపై స్థానిక అధికారులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించింది. క్రికెటర్లకు కల్పించిన భద్రతపై తాము సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంది. -
ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్...
-
ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్...
- ఆస్ట్రేలియా ఆటగాళ్ల సుదీర్ఘ సాధన - కోహ్లీ, అశ్విన్‌లను ఉద్దేశించి వార్నర్ ఆసక్తికర కామెంట్స్ ముంబై: భారత గడ్డపై భారీ సమరానికి సన్నద్ధమవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బుధవారం తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టింది. జట్టు సభ్యులంతా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. కీలక ఆటగాళ్లు స్మిత్, వార్నర్, ఖాజా, మ్యాక్స్‌వెల్ నెట్స్‌లోని వేర్వేరు వికెట్లపై తమ ప్రాక్టీస్‌ను కొనసాగించగా, మరి కొందరు స్లిప్ క్యాచింగ్‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా స్థానిక స్పిన్ బౌలర్లతో పాటు జట్టు స్పిన్ కన్సల్టెంట్ శ్రీధరన్ శ్రీరామ్ బౌలింగ్‌లో ఆసీస్ క్రికెటర్లంతా స్పిన్‌ను ఆడటంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’తో ఆస్ట్రేలియా తలపడుతుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు ఈ నెల 23 నుంచి పుణేలో జరుగుతుంది. అశ్విన్‌తో పోరుకు సిద్ధం...: భారత్‌తో సిరీస్ అంటే ఆసీస్‌కు అశ్విన్ రూపంలోనే అగ్నిపరీక్ష ఎదురవుతోంది. నాలుగేళ్ల క్రితం 0–4తో కంగారూలు చిత్తుగా ఓడిన సిరీస్‌లో అశ్విన్ 29 వికెట్లతో చెలరేగాడు. ఈసారి భారత ఆఫ్ స్పిన్నర్‌ను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధమై వచ్చామని ఆ జట్టు అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ వార్నర్ అన్నాడు.‘ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ మనసును చదివి బౌలింగ్ చేసే అశ్విన్ లాంటి బౌలర్నునేను గౌరవిస్తా. అతని బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడటం అవసరం. అయితే అశ్విన్ కోసం నా వద్ద ప్రత్యేక ప్రణాళిక సిద్ధంగా ఉంది. మా ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు’ అని వార్నర్ చెప్పాడు. కోహ్లితో స్లెడ్జింగ్ అంటే వ్యతిరేక ఫలితం వచ్చే ప్రమాదం కూడా ఉంటుందన్న వార్నర్... మాటల యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలో గొప్ప ఆటగాళ్లకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. స్లెడ్జింగ్ విషయంలో వార్నర్‌తో అతని సహచరుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఏకీభవించాడు. అందుకే కోహ్లితో స్లెడ్జింగ్‌కు దిగే సాహసం చేయనని స్పష్టం చేశాడు. ‘కోహ్లిని నేను ఏమీ అనదల్చుకోలేదు. అది మాత్రం ఖాయం. ఎందుకంటే అతడితో పెట్టుకుంటే ఇక అంతే సంగతులు. ప్రస్తుతం అత్యద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లి అవుట్ కావాలంటే ఏ రనౌట్లాంటిదో అదృష్టం మాకు కలిసి రావాల్సిందే’ అని మ్యాక్స్‌వెల్ వ్యాఖ్యానించాడు. మరోవైపు భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ స్టార్క్ కూడా మంచి ప్రభావం చూపించగలడని, అతని పదునైన బౌలింగ్ విరాట్ కోహ్లిని కూడా ఇబ్బంది పెట్టవచ్చని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఆస్ట్రేలియా జట్టు వచ్చేసింది...
టీమిండియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సోమవారం భారత్‌లో అడుగు పెట్టింది. దుబాయ్‌లో శిక్షణ శిబిరాన్ని ముగించుకున్న స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ముంబైకి చేరుకుంది. ఈనెల 17 నుంచి 19 వరకు ముంబైలో భారత ‘ఎ’ జట్టుతో ఆసీస్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత వరుసగా నాలుగు టెస్టుల్లో (ఫిబ్రవరి 23–27 పుణే; మార్చి 4–8 బెంగళూరు; మార్చి 16–20 రాంచీ; మార్చి 25–29 ధర్మశాల) భారత్‌తో తలపడుతుంది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. -
కొత్త బాధ్యతలో రికీ పాంటింగ్...
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కొత్త బాధ్యతలో కనిపించనున్నాడు. శ్రీలంకతో ఫిబ్రవరిలో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు పాంటింగ్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. జస్టిన్ లాంగర్ చీఫ్ కోచ్‌గా, జాసెన్ గిలెస్పీ మరో అసిస్టెంట్ కోచ్‌గా ఉంటారని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. గత ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు పాంటింగ్ చీఫ్ కోచ్‌గా ఉన్నాడు.