భారత్, ఇంగ్లండ్ వన్డే నేడు గెలిచిన జట్టు ముక్కోణపు టోర్నీ ఫైనల్‌కు ప్రపంచకప్‌ను నిలబెట్టుకుంటామనే ధీమాతో ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ముక్కోణపు టోర్నీలో ఒక్క విజయం కూడా లేక... తుది జట్టు కూర్పు ఎలాగో అర్థం కాక తల్లడిల్లిపోతోంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలంటే తక్షణమే ఓ విజయం కావాలి. ఇంగ్లండ్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్ ఆడే అవకాశం రావడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేదంటే ప్రపంచకప్‌నూ అయోమయ స్థితిలోనే ప్రారంభించాల్సి వస్తుంది.