రోహిత్ సెంచరీ వృథా.. ఆసీస్ విజయం | australia-beats-india-by-4-wickets | Sakshi
Sakshi News home page

Jan 18 2015 6:18 PM | Updated on Mar 21 2024 8:51 PM

ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ చేసినా భారత్కు ఓటమి తప్పలేదు. ముక్కోణపు సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 4 వికెట్లతో ఆసీస్ చేతిలో ఓడిపోయింది. 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కంగారూలు ఆరు వికెట్లు కోల్పోయి మరో ఆరు బంతులు మిగిలుండగా విజయాన్నందుకున్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్.. ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్ను కట్టడి చేశాడు. రోహిత్, రైనా మినహా ఇతర భారత బ్యాట్స్మెన్ పరుగుల వేటలో విఫలమయ్యారు. చివర్లో ఉత్కంఠ: ఆసీస్ లక్ష్యఛేదనను దూకుడుగా ఆరంభించింది. ఫించ్ (96) , స్మిత్ (47), వాట్సన్ (41) రాణించడంతో సునాయాసంగా విజయం దిశగా పయనించింది. కాగా 216/2 స్కోరు వద్ద షమీ.. స్మిత్ను అవుట్ చేయడంతో ఆసీస్ జోరు తగ్గింది. ఉమేష్ యాదవ్ ఆ వెంటనే ఫించ్ను అవుట్ చేసి ఆసీస్పై ఒత్తిడి పెంచారు. కాసపటికే భారత్ బౌలర్లు మరో రెండు వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కెప్టెన్ బెయిలీని అశ్విన్ అవుట్ చేయగా, ఆ వెంటనే మ్యాక్స్వెల్ను భువనేశ్వర్ పెవిలియన్ బాటపట్టించాడు. ఈ దశలో ఆసీస్ విజయానికి 18 బంతుల్లో 20 పరుగులు అవసరం. కాగా ఫాల్కనర్, హాడిన్ మరో వికెట్ పడకుండా ఆసీస్ను గెలిపించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement