ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా తొలి ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి ఎనిమిది పరుగులు మాత్రమే చేసింది.
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా తొలి ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి ఎనిమిది పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్(1) పరుగు మాత్రమే పెవిలియన్ కు చేరడంతో టీమిండియా నెమ్మదిగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం అంబటి రాయుడు(2), రహానే(4) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
ఇంగ్లండ్ అటాకింగ్ బౌలర్ అండర్ సన్ బౌలింగ్ లో శిఖర్ ధావన్ అనవసరపు షాట్ కు యత్నించి బట్లర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.