
ఇమ్రుల్ కైస్
ఢాకా: ఓపెనర్ ఇమ్రుల్ కైస్ (140 బంతుల్లో 144; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత శతకంతో చెలరేగడంతో జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 28 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1–0తో ముం దంజ వేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. మిథున్ (37), సైఫుద్దీన్ (50; 3 ఫోర్లు, 1 సిక్స్)ల సాయంతో కైస్ జట్టుకు మంచి స్కోరు అందించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే 50 ఓవర్లలో 9 వికెట్లకు 243 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ (50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), జార్విస్ (37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగినా అప్పటికే ఆలస్యమైపోయింది.