
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో ప్రారంభమైన ముక్కోణపు టి20 సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని బోణి కొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించింది. 148 పరుగుల లక్ష్యాన్ని మరో 3 బంతులు మిలిగివుండగానే చేరుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లీషు టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 147 పరుగులు చేసింది. కెప్టెన్ నైట్(67), బీమౌంట్(37) మాత్రమే రాణించారు. రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, దీప్తి శర్మ రెండేసి వికెట్లు పగొట్టారు. రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. చివరి ఓవర్‌లో సిక్సర్‌తో జట్టుకు విజయాన్ని అందించింది. షఫాలి వర్మ 30, రొడ్రిగ్స్ 26, స్మృతి మంధన 15, భాటియా 11, దీప్తి శర్మ 12 పరుగులు చేశారు. స్మృతి మంధన వివాదాస్పద క్యాచ్‌తో జౌట్ కావడంతో తక్కువ స్కోరు వెనుదిరగాల్సి వచ్చింది. (చదవండి: టీమిండియా ‘డబుల్ సూపర్’)
Comments
Please login to add a commentAdd a comment