హోవ్ (ఇంగ్లండ్): బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతంగా ఆడటంతో... ఇంగ్లండ్‌లో జరిగిన అండర్–19 ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. హోవ్ నగరంలో ఆదివారం జరిగిన ఫైనల్లో యువ భారత్ ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బంగ్లాదేశ్ సరిగ్గా 50 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. హసన్ జాయ్ (109; 9 ఫోర్లు, సిక్స్) సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రా రెండేసి వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసి గెలిచింది. యశస్వి జైస్వాల్ (50), దివ్యాంశ్ సక్సేనా (55), కెప్టెన్ ప్రియమ్ గార్గ్ (73), ధ్రువ్ జురెల్ (59 నాటౌట్) అర్ధ సెంచరీలు చేశారు. హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు. ధ్రువ్‌తో కలిసి తిలక్ వర్మ అజేయ ఐదో వికెట్‌కు 29 పరుగులు జోడించాడు.
Comments
Please login to add a commentAdd a comment