
ధావన్ మరో 'సారీ'
ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆరు ఓవర్లు ముగిసిన అనంతరం ఎనిమిది పరుగులు చేసిన ధావన్ అనవసరపు షాట్ కు యత్నించి పెవిలియన్ కు చేరాడు. వద్ద ఇప్పటికే వరుస వైఫల్యాలతో పేలవ ఫామ్ కనబరుస్తున్న ధావన్ ఈ మ్యాచ్ లోనూ రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్ లో ధావన్ 13 బంతుల్లో 8 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్లో ఫించ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ సమయానికి జట్టు స్కోరు 6 ఓవర్లకు 24 పరుగులు. ఓపెనర్ రహానె (13), రాయుడు (0) క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా మ్యాచ్ ను 44 ఓవర్లకు కుదించారు.