ఫఖర్ జమాన్
హరారే: ముక్కోణపు టి20 క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (46 బంతుల్లో 91; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో పాక్‌ను గెలిపించాడు. మొదట ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేయగా... పాక్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి విజయం సాధించింది.
ఆసీస్ ఓపెనర్లు షార్ట్ (53 బంతుల్లో 76; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫించ్ (27 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం పాక్ 2 పరుగులకే ఫర్హాన్ (0), హుస్సేన్ (0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో కెప్టెన్ సర్ఫరాజ్ (28; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 45 పరుగులు జతచేసిన ఫఖర్ ఆ తర్వాత షోయబ్ మాలిక్ (37 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 107 పరుగులు జతచేశాడు. అనంతరం ఫఖర్ అవుటైనా షోయబ్ మాలిక్ మిగతా పని పూర్తిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment