
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే అండ్ నైట్ వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే అండ్ నైట్ వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్ లు కోల్పోయిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో గెలిచి రేసులో నిలవాలని యత్నిస్తోంది. కాగా మంచి ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా వరుసు మ్యాచ్ ల్లో గెలిచి ఫైనల్ కు చేరింది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ కు ఫైనల్ కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి.
కాని పక్షంలో టీమిండియా ముక్కోణపు సిరీస్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.సోమవారం ఉదయం సిడ్నీ లో వర్షం రావడంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.