ముక్కోణపు సిరీస్ లో భాగంగా శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 40 ఓవర్లు ముగిసే సరికి 244పరుగులు చేసింది.
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 40 ఓవర్లు ముగిసే సరికి 244పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ కు శుభారంభం లభించింది.ఇంగ్లండ్ ఓపెనర్లు మొయిన్ అలీ, ఇయాన్ బెల్ లు ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించారు.
ఓపెనర్ మొయిన్ అలీ(46) పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా, మరో ఓపెనర్ ఇయాన్ బెల్ దూకుడుగా ఆడుతున్నాడు. 119బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 135 పరుగులు చేసిన బెల్ క్రీజ్ లో ఉండగా, అతనికి జతగా ఉన్న జో రూట్ (53) పరుగులు చేశాడు.