
30 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 153/3
భారత్- ఆస్ట్రేలియాల మధ్య ఇక్కడ జరుగుతున్న మ్యాచ్లో 30 ఓవర్లకు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య ఇక్కడ జరుగుతున్న మ్యాచ్లో 30 ఓవర్లకు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 90 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. సురేష్ రైనా 48 బంతుల్లో 6 ఫోర్లతో 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్లోనే శిఖర్ ధావన్ రూపంలో వికెట్ కోల్పోయిన భారత్కు రోహిత్ అండగా నిలిచాడు.
తరువాత వచ్చని రహానే, కోహ్లి ఎవరూ క్రీజులో కుదురుకోకపోయినా రోహిత్ తనదైన శైలిలో ఆటను కొనసాగిస్తున్నాడు. రోహిత్కు తోడుగా రైనా కూడా చక్కటి సహకారం అందిస్తున్నాడు. అడపాదడపా ఫోర్లు బాదుతున్న రైనా అర్థ సెంచరీకి చేరువలో ఉన్నాడు.
ఓపెనర్ శిఖర్ ధావన్ (2), రహానే (12), కోహ్లి (9) ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, ఫాల్క్నర్, గురిందర్ ఒక్కో వికెట్ తీశారు.