టీమిండియా ఆటగాళ్లకు కొత్త యూనిఫాం | Team India's new ODI jersey unveiled | Sakshi
Sakshi News home page

టీమిండియా ఆటగాళ్లకు కొత్త యూనిఫాం

Published Thu, Jan 15 2015 2:44 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

టీమిండియా ఆటగాళ్లకు కొత్త యూనిఫాం

టీమిండియా ఆటగాళ్లకు కొత్త యూనిఫాం

టీమిండియా ఆటగాళ్లకు కొత్త యూనిఫాం వచ్చింది. భారత్ క్రికెట్ జట్టు అధికారిక దుస్తుల స్పాన్సర్ నైకీ గురువారం మెల్బోర్న్లో  న్యూ జెర్సీని ఆవిష్కరించింది. ఆస్ట్రేలియాలో శుక్రవారం నుంచి జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం టీమిండియా ఈ దుస్తులను ధరించనుంది. సగటున 33 ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి ఒకో కిట్ను నైకీ తయారు చేసింది.  

అంతేకాకుండా కొత్త యూనిఫాం కోసం ఆటగాళ్లందరి అభిప్రాయం కూడా తీసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఆటగాళ్ల ప్రతిభను దృష్టిలో పెట్టుకుని డ్రై-ఫిట్ టెక్నాలజీతో ఈ జెర్సీలను తయారు చేశామని, ఆటగాళ్ల శరీర ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉండేలా.. వారు ఆటపై దృష్టి పెట్టేందుకు కొత్త దుస్తులు దోహదపడతాయని తెలిపింది. మరోవైపు టీమిండియా కెప్టెన్ ధోనీ సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement