
ముక్కోణపు సిరీస్: రోహిత్ ఖాతాలోమరో రికార్డు
మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఓపెనర్ రోహిత్ శర్మ మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
మెల్బోర్న్: మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఓపెనర్ రోహిత్ శర్మ మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్టులో ఎక్కాడు.
ఇంతకుముందు ఇక్కడ భారత బ్యాట్స్మేన్ శ్రీకాంత్, అగార్కర్ 2 సిక్సర్లు బాదారు. తాజాగా తన వ్యక్తిగత స్కోరు 49 పరుగుల వద్ద రోహిత్ ఫాల్కనర్ బౌలింగ్లో సిక్సర్ బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని ఆ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.