
ఆసీస్-టీమిండియాల మ్యాచ్ కి వర్షం అడ్డంకి
ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియా- టీమిండియా జట్ల మధ్య జరగాల్సిన ఐదో లీగ్ మ్యాచ్ కు వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది.
సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియా- టీమిండియా జట్ల మధ్య జరగాల్సిన ఐదో లీగ్ మ్యాచ్ కు వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది. సోమవారం ఉదయం సిడ్నీ లో వర్షం రావడంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారిన సమయంలో వర్షం రావడం క్రికెట్ అభిమానుల్ని నిరాశకు గురి చేస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా వరుస మ్యాచ్ ల్లో గెలిచి ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే.