
ఫించ్ ,షార్ట్
మెల్‌బోర్న్: సమష్టి ఆటతీరు కనబరుస్తున్న ఆస్ట్రేలియా ముక్కోణపు టి20 టోర్నీలో తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్‌కు చేరింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టి20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రిచర్డ్‌సన్ (3/33), స్టాన్‌లేక్ (2/28) ధాటికి నిలవలేక తక్కువ స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (49 బంతుల్లో 46; 3 ఫోర్లు) బిల్లింగ్స్ (23 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
అనంతరం బరిలోకి దిగిన ఆసీస్ మ్యాక్స్‌వెల్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షార్ట్ (36 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ లిన్ (19 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫించ్ (5 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలో చేయి వేయడంతో 14.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ముక్కోణపు టోర్నీలో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లు ఆస్ట్రేలియాలో జరగ్గా... మిగతా మూడు మ్యాచ్‌లతోపాటు ఫైనల్‌కు న్యూజిలాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. మంగళవారం వెల్లింగ్టన్‌లో జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ ఆడుతుంది.