
ఇయాన్ బెల్ సెంచరీ, ఇంగ్లండ్ స్కోరు 177/2
ముక్కోణపు సిరీస్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ ఇయాన్ బెల్ సెంచరీతో అదరగొట్టాడు.
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ ఇయాన్ బెల్ సెంచరీతో అదరగొట్టాడు. 92 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేశాడు. గత మ్యాచ్ లో టీమిండియాపై చెలరేగిన బెల్ అదే ఊపును ప్రదర్శిస్తూ ఆసీస్ పై సెంచరీతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.
దీంతో 30.4 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అంతకుముందు మొయిన్ అలీ (46), జేమ్స్ టేలర్ (5) పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత ఇంగ్లండ్ ను బ్యాటింగ్ చేయాలని ఆహ్వానించింది.