ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 30 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
హోబార్ట్:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 30 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇయాన్ బెల్ (99) పరుగులతో క్రీజ్ లో ఉండటంతో ఇంగ్లండ్ భారీ స్కోరును నమోదు చేసే దిశగా సాగుతోంది. అంతకుముందు మొయిన్ అలీ (46), జేమ్స్ టేలర్ (5) పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత ఇంగ్లండ్ ను బ్యాటింగ్ చేయాలని ఆహ్వానించింది.