
ఆసీస్ స్కోరు 27 ఓవర్ల అనంతరం 158/3
ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో 28 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
సిడ్నీ : ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో 28 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 27వ ఓవర్ చివరి బంతికి స్టీవెన్ స్మిత్ వెనుదిరిగాడు. 47 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్తో 37 పరుగులు చేసి అలీ బౌలింగ్లో ఔటయ్యాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 47.5 ఓవర్లలో 234 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 235 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
తొలి వికెట్ను త్వరగానే కోల్పోయిన ఆసీస్.. వాట్సన్ వికెట్ను 71 పరుగుల స్కోరు వద్ద కోల్పోయింది. డేవిడ్ వార్నర్, జార్జ్ బెయిలీ క్రీజులో ఉన్నారు.