న్యూఢిల్లీ: మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసి రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల జట్టు గత ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుండటంతో... ఎనిమిది నెలల తర్వాత భారత జ ట్టు అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ (2017–2020)లో భాగంగా మార్చి 12–18 మధ్య బరోడాలో జరిగే మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా పాల్గొననుంది. అనంతరం మార్చి 22 నుంచి ముంబైలో జరిగే ముక్కోణపు టి20 సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియాలతో పాటు ఇంగ్లండ్ జట్లు పాల్గొంటాయని బీసీసీఐ శుక్రవారం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment