టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ | England bat, Anderson misses out | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్

Jan 16 2015 8:32 AM | Updated on Sep 2 2017 7:46 PM

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్

ప్రపంచ కప్‌కు ముందు ఆసీస్ గడ్డపై అసలైన వన్డే సన్నాహకంగా పేర్కొంటున్న ముక్కోణపు వన్డే టోర్నీకి తెర లేచింది.

సిడ్నీ :  ప్రపంచ కప్‌కు ముందు ఆసీస్ గడ్డపై అసలైన వన్డే సన్నాహకంగా పేర్కొంటున్న ముక్కోణపు వన్డే టోర్నీకి తెర లేచింది. శుక్రవారం ఇక్కడ జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఆ వన్డేలో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలో ఆ జట్టు మొదటి సారి బరిలోకి దిగుతోంది.   

భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇందులో పాల్గొంటున్నాయి. టోర్నీలో ప్రతి జట్టు ఒక్కో ప్రత్యర్థితో రెండేసి సార్లు తలపడుతుంది. పాయింట్ల ఆధారంగా అగ్రస్థానంలో నిలిచిన రెండు టీమ్‌లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత్, ఆసీస్ ఇప్పుడు వన్డే మ్యాచ్‌ల బరిలోకి దిగబోతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement