తడబాటుతో మొదలు | india loses against australia | Sakshi
Sakshi News home page

తడబాటుతో మొదలు

Published Mon, Jan 19 2015 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

తడబాటుతో మొదలు

తడబాటుతో మొదలు

ఇరుజట్లలో చెరో ఓపెనర్ చెలరేగిపోయాడు. భారత్ తరఫున రోహిత్ శర్మ (139 బంతుల్లో 138; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకం సాధిస్తే...

ఆసీస్ చేతిలో భారత్ ఓటమి

 మెల్‌బోర్న్: ఇరుజట్లలో చెరో ఓపెనర్ చెలరేగిపోయాడు. భారత్ తరఫున రోహిత్ శర్మ (139 బంతుల్లో 138; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకం సాధిస్తే... ఆరోన్ ఫించ్ (127 బంతుల్లో 96; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆసీస్‌కు శుభారంభం అందించాడు. అయితే రెండు జట్లలో స్టార్క్ (6/43) రూపంలో ఉన్న ఒకే ఒక్క తేడా కంగారూలకు విజయాన్ని అందించింది. టీమిండియాకు భంగపాటును మిగిల్చింది.

ఫలితంగా ఆసీస్ గడ్డపై ప్రపంచకప్ సన్నాహాలను ఘనంగా ప్రారంభించాలని భావించిన భారత్‌కు... ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లోనే పరాజయం ఎదురైంది. ఎంసీజీలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో టీమిండియాపై నెగ్గి ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

 టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 267 పరుగులు చేసింది. రైనా (63 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. ఆసీస్ పేసర్ల ముందు ధోనిసేన టాప్ ఆర్డర్ చతికిలపడింది. వరుస విరామాల్లో ధావన్ (2), రహానే (12), కోహ్లి (9) అవుట్ కావడంతో భారత్ 59 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్, రైనాలు నాలుగో వికెట్‌కు 126 పరుగులు జోడించి ఇన్నిం గ్స్‌ను చక్కదిద్దారు.

రైనా అవుటైన తర్వాత ధోని (19) కాసేపు క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు. కానీ స్టార్క్... భారత్ మిడిలార్డర్‌ను వణికించాడు. ఓ ఎండ్‌లో రోహిత్ నిలకడను చూపినా... రెండో ఎండ్‌లో సహచరులు వికెట్లు కాపాడుకోలేకపోయారు. రోహిత్ కెరీర్‌లో ఆరో సెంచరీని సాధిం చాడు. భారత సంతతికి చెందిన ఆసీస్ బౌలర్ గురిందర్ సంధూ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు.
 
తర్వాత ఆసీస్ 49 ఓవర్లలో 6 వికెట్లకు 269 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. వార్నర్ (24) విఫలమైనా... ఫించ్ నిలకడగా ఆడాడు. వాట్సన్ (41; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. స్మిత్ (52 బంతుల్లో 47; 6 ఫోర్లు) కూడా సమయోచితంగా స్పందించడంతో ఆసీస్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అయితే కంగారూల స్కోరు 216/2 ఉన్న దశలో భారత్ బౌలర్లు 23 బంతుల వ్యవధిలో స్మిత్, ఫించ్, బెయిలీ (5)లను అవుట్ చేశారు. కానీ చివర్లో హాడిన్ (13 నాటౌట్), ఫాల్క్‌నర్ (9 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. స్టార్క్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది.

స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 138; ధావన్ (సి) ఫించ్ (బి) స్టార్క్ 2; రహానే (సి) హాడిన్ (బి) సంధూ 12; కోహ్లి (సి) బెయిలీ (బి) ఫాల్క్‌నర్ 9; రైనా (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 51; ధోని (బి) స్టార్క్ 19; అక్షర్ ఎల్బీడబ్ల్యూ (బి) స్టార్క్ 0; అశ్విన్ నాటౌట్ 14; భువనేశ్వర్ (బి) స్టార్క్ 0; షమీ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 267

వికెట్ల పతనం: 1-3; 2-33; 3-59; 4-185; 5-237; 6-237; 7-262; 8-262
బౌలింగ్: స్టార్క్ 10-2-43-6; కమిన్స్ 10-0-52- 0; గురీందర్ 10-0-58-1; ఫాల్క్‌నర్ 10-0-63- 1; వాట్సన్ 8-0-33-0; మ్యాక్స్‌వెల్ 2-0-14-0.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (సి) ధోని (బి) ఉమేశ్ 96; వార్నర్ (సి) రైనా (బి) ఉమేశ్ 24; వాట్సన్ (బి) అక్షర్ 41; స్మిత్ (సి) అశ్విన్ (బి) షమీ 47; మ్యాక్స్‌వెల్ (సి) అండ్ (బి) భువనేశ్వర్ 20; బెయిలీ (సి) ధోని (బి) అశ్విన్ 5; హాడిన్ నాటౌట్ 13; ఫాల్క్‌నర్ నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: (49 ఓవర్లలో 6 వికెట్లకు) 269
 వికెట్ల పతనం: 1-51; 2-115; 3-216; 4-219; 5-230; 6-248
 బౌలింగ్: భువనేశ్వర్ 9.5-0-44-1; ఉమేశ్ యాదవ్ 10-1-55-2; షమీ 8.1-0-44-1; అక్షర్ 10-0-45-1; అశ్విన్ 9-0-54-1; రైనా 2-0-24-0.
 
 ‘కొత్త బంతితో మా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. 30వ ఓవర్ వరకు మ్యాచ్ వాళ్ల వైపే ఉంది. కానీ 35 ఓవర్ల తర్వాత బంతి రివర్స్ స్వింగ్ కావడంతో ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్ బాగానే జరిగింది. ఫలితం గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా.. చివర్లో టోర్నీ గెలిచామా లేదా అన్నది ముఖ్యం. దీన్ని ఆటగాళ్లు దృష్టిలో పెట్టుకోవాలి. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మరింత బాధ్యతగా ఆడాలి. మన బౌలర్లు అనుకూలంగా రాణించేందుకు అవసరమైనన్నీ పరుగులు స్కోరు బోర్డు మీద ఉంచాలి. స్టార్క్ బౌలింగ్ సూపర్బ్. రోహిత్ బ్యాటింగ్ బాగా చేశాడు. ’               
 -ధోని (భారత కెప్టెన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement