లంక శుభారంభం | Victory over Zimbabwe in a tri-series | Sakshi
Sakshi News home page

లంక శుభారంభం

Published Tue, Nov 15 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

లంక శుభారంభం

లంక శుభారంభం

ముక్కోణపు సిరీస్‌లో జింబాబ్వేపై గెలుపు

హరారే: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఓపెనర్ ధనంజయ డిసిల్వా (75 బంతుల్లో 78 నాటౌట్; 12 ఫోర్లు) రాణించడంతో శ్రీలంక శుభారంభం చేసింది. సోమవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే 41.3 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. పీటర్ మూర్ (52 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడగా, కెప్టెన్ క్రీమర్ 31 పరుగులు చేశాడు.

లంక బౌలర్లలో గుణరత్నే 3 వికెట్లు తీయగా, కులశేఖర, లక్మల్, ప్రదీప్ తలా 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 24.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోరుు 155 పరుగులు చేసి గెలిచింది. డిసిల్వాతో పాటు నిరోషన్ డిక్‌వెలా (41) మెరుగ్గా ఆడాడు. పన్యాంగర, చిబాబా చెరో వికెట్ తీశారు. ఈ టోర్నీలో తదుపరి మ్యాచ్ రేపు (బుధవారం) శ్రీలంక, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement