
ఆసీస్ లక్ష్యం 268
భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీంఇండియా ఆసీస్ ముందు 268 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీంఇండియా ఆసీస్ ముందు 268 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ రోహిత్ శర్మ అజేయ సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ తన కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆరు వికెట్లు తీసి భారత్ను కట్టడి చేయటంలో కీలక పాత్ర పోషించాడు. గురిందర్, ఫాల్కనర్ ఒక్కో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్లో ఫించ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన ఆటగాళ్లు రహానే (12), కోహ్లి (9) కూడా ఎంతోసేపు నిలవలేకపోయారు. వారి తరువాత వచ్చిన ఆల్రౌండర్ సురేశ్ రైనా కాసేపు నిలకడ ప్రదర్శించారు. 63 బంతులు ఎదుర్కొన్న రైనా 6 ఫోర్లతో 51 పరుగులు చేసి రోహిత్కు చక్కటి సహకారం అందించారు. రోహిత్ శర్మ తనదైన శైలిలో ఆడి అజేయ సెంచరీ (138)తో జట్టును ఆదుకున్నారు.
వారెవ్వా 'స్టార్క్'
ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో తన సత్తా ఏంటో చూపించి వారెవ్వా అనిపించాడు. భారత్ స్కోరుకు అడ్డుకట్ట వేయటంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఓవర్ నుంచే ఇండియా మీద పైచేయి సాధిస్తూ బ్యాట్స్మెన్లందరినీ పెవిలియన్కు చేర్చాడు. ఒకే ఓవర్లో రెండేసి వికెట్లు రెండుసార్లు తీశాడు. జట్టు స్కోరు 237 ధోని, అక్షర్ పటేల్లను, 262 పరుగుల వద్ద రోహిత్, భువనేశ్వర్లను పెవిలియన్కు పంపాడు. రహానే, కోహ్లి మినహా మిగతా వికెట్లన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు ఈ బౌలర్.