
ఆసీస్ విజయ లక్ష్యం 304
ముక్కోణపు సిరీస్ లో ఇక్కడ ఆసీస్ జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 304 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
హెబార్ట్: ముక్కోణపు సిరీస్ లో ఇక్కడ ఆసీస్ జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 304 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఇంగ్లండ్ ఓపెనర్లు మొయిన్ అలీ(46), ఇయాన్ (141) పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జో రూట్ (69) పరుగులు చేసి కాసేపు మెరుపులు మెరిపించాడు. చివర్లో జేసీ బట్లర్(25), రవి బోపారా(7) పరుగులు చేయడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది.
ఇదే స్కోరు వద్ద ఇంగ్లండ్ వరుసుగా మూడు వికెట్లను కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో జీఎస్ సంధుకు రెండు వికెట్లు లభించగా, స్టార్క్, కమ్మిన్స్, హెన్రీక్యూస్, ఫలక్ నర్ లకు తలో వికెట్ దక్కింది.