
రాయుడికి ఇబ్బందిగా మారిన బ్యాటింగ్ ఆర్డర్
ముక్కోణపు సిరీస్ లో టీమిండియా ఫైనల్ కు చేరాలంటే ఇంగ్లండ్ పై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి.
పెర్త్: ముక్కోణపు సిరీస్ లో టీమిండియా ఫైనల్ కు చేరాలంటే ఇంగ్లండ్ పై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అయితే టాప్ ఆర్డర్ ఆటగాళ్ల బెడద టీమిండియాను తీవ్రంగా వేధిస్తోంది. ఒకప్రక్క రోహిత్ శర్మ శుక్రవారం నాటి మ్యాచ్ లో ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తుంటే.. మరోప్రక్క అంబటి రాయుడి తన బ్యాటింగ్ ఆర్డర్ తో ఇబ్బంది పడుతున్నాడు. జట్టు వర్గాలు రోహిత్ శర్మ ఫిట్ సాధించాడని చెబుతున్నా.. రోహిత్ ఆడతాడా?లేడా?అనేది అనుమానంగానే ఉంది. ఒకవేళ రేపటి మ్యాచ్ లో రోహిత్ కనుక ఆడకపోతే రాయుడు మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది.
అయితే రాయుడు ఈ స్థానంలో ఆడటానికి ఇబ్బందిపడుతున్నాడు. గత మ్యాచ్ ల్లో రాయుడు ఆ స్థానంలో ఆడి విఫలం చెందడంతో టీమిండియా సుదీర్ఘమైన కసరత్తు చేస్తోంది. ఆ స్థానంలో ఏ ఆటగాడిని పంపాలనే అన్వేషణలో పడింది. కాగా, ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ ఇంగ్లండ్ తో జరిగే కీలక వన్డేలో ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.