
మోర్గాన్ ఒంటరి పోరాటం
ముక్కోణపు వన్డే సిరీస్లో ఇంగ్లండ్ ఆటగాడు మోర్గాన్ ఒంటరి పోరాటం చేశాడు. 130 బంతుల్లో సెంచరీ (108) చేశాడు.
సిడ్నీ : ముక్కోణపు వన్డే సిరీస్లో ఇంగ్లండ్ . కొత్త కెప్టెన్ మోర్గాన్ ఒంటరి పోరాటం చేశాడు. 136 బంతుల్లో సెంచరీ (121) చేశాడు. సహచర ఆటగాళ్లు ...వెంటవెంటనే పెవిలియన్ దారి పట్టినా అతడు మాత్రం నిలకడగా ఆడుతూ క్రీజ్లోనే పాతుకుపోయాడు. ఇంగ్లండ్‌ను ఆదుకోవడమే కాకుండా తన కెరీర్‌లో 7వ సెంచరీని 11 ఫోర్లు, 3 సిక్సర్లతో పూర్తి చేశాడు. ఇక మోర్గాన్ తప్ప ...ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఒకటి, రెండంకెల స్కోర్కే వెనుదిరిగారు. మోర్గాన్ 121 పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు.